145.
అణచివేస్తున్నాను,
అంటున్నావేల?
నీవు తొక్కి పెట్టింది,
నాగుపాము తల!
అణచివేత అనేక,
విప్లవాలకు జన్మదాత!
ఓ మనిషి కావద్దు,
మరో జార్ చక్రవర్తి !
కావాలి జగాన ,
మానవతా సమవర్తి!
146.
రావణుని, విభీషణ,
వివక్షత, లంకా నాశనం!
ధృతరాష్ట్రుని పాండవ,
వివక్షత కురుసంగ్రామం!
బ్రిటిష్ దమన నీతి ,
వారికి వారే నేర్చుకున్న చితి !
అహంకారం, యుగమేదైనా,
, పతన కారణం!
మానవత నాదం,
విశ్వాన శాంతి రాగం!
147.
మానవవివక్షతే మనిషికి,
వీడని అంటరానితనం!
మానవసమతే,
అక్కున చేర్చే గుణం!
మానవత చూపు,
సదా సమతా మార్గం !
సమదర్శి జగాన క్రాంతిదర్శి!
క్రాంతిదర్శి జాతికి మార్గదర్శి!
_________
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి