డా.పివిఎల్ సుబ్బారావు,-9441058797.
   జీవన సార్ధకత.
           ఫలశ్రుతి.
151. 
        భూమిపై ,
           పచ్చదనం, పెంచు!
       నదీ జలాలు ,
            స్వచ్ఛంగా ఉంచు!
      అగ్నిని ,
  స్వాహా దేవతగా పూజించు! 
      వాయు కాలుష్యం,
   సంపూర్ణంగా.  నిరోధించు !
    ఆకాశం నిర్మలంగా,
                         ప్రకాశించు!
152.
      ఉగ్రవాదం తిక్క దారి, 
   మానవతావాదం పక్కా దారి! 
   ఉద్రేకం తల బిరుసుదనం,
          ఉదాత్తత సరి సుగుణం! 
  ఉన్నన్నాళ్ళు హుంకరించకు, 
      ఆత్మీయంగా  పలకరించు !
  నీవు పోయినా ,మంచి వాడు,
         పోయాడు ,అనిపించు !
అక్షర రూపమై, అమరవాణిగా, మానవతా గానం వినిపించు!
153.
      మానవతే ఆలోచించు!    
      మానవతే ప్రవచించు !
      మానవతే ఆచరించు! 
     జీవితాంతం స్వీకరించు !
     జాతి నీకు నమస్కరించు!
-------------------------------------------------------
        విన్నపము.
1.
తేది 3/ 9 /23.న ప్రారంభమైన, 
జీవన సార్ధకత ,
తేది 23 /9 / 23 కి, 
చదువరుల ప్రోత్సాహంతో, పూర్తి అయినది ,
అందరికీ కృతజ్ఞత, తెలియజేస్తున్నాను.
2.
మీ అమూల్యమైన, స్పందన,
తెలియజేయమని విజ్ఞప్తి,
 దీనిని పుస్తక ముద్రణలో పొందుపరుస్తాము.
3. 
  జీవన సార్ధకత కి,
 ఓ శీర్షిక  తెలియజేయండి,
4. 
మీ ప్రతిక్రియ సాధ్యమైనంత, తొందరగా, 
తేది27 /11/ 23, 
లోపుగా ఆశిస్తున్నాను.
భవదీయుడు ,
డా.పి.వి.ఎల్.సుబ్బారావు,
9441058797.
కామెంట్‌లు