పుస్తక పఠనం సమీక్షారచన ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్- -తెలుగు ఉపాధ్యాయులు, జే ఆర్ ఎం హైస్కూల్, భైంసా, నిర్మల్ జిల్లా సెల్ నెం9441333315
 
పదో తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులకు నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాలు ఉంటాయి. ఒక్కొక్క మూల్యాంకనంలో పుస్తక పఠనం సమీక్షా రచనకు 5 మార్కులు, ప్రాజెక్టు వర్క్ కు5మార్కులు, స్లిప్ టెస్ట్కు 5 మార్కులు, వ్రాత పని కి 5మార్కులు  చొప్పున నిర్మాణాత్మక మూల్యంకణానికి 20 మార్కులు ఉంటాయి. ఇలా నాలుగు నిర్మాణాత్మక మూల్యంకణాలు పూర్తి అయిన తరువాత నాలుగు మూల్యంకణాల సరాసరి ఒక్కొక్క అంశం వారిగా తీయబడుతుంది. ఈ విధంగా తీసినప్పుడు పుస్తక పఠనం సమీక్షా రచనకు ఐదు మార్కులు కేటాయిస్తారు.
పదో తరగతి పరీక్షలు వ్రాయబోయే విద్యార్థులకు ఈ పుస్తక పఠనం సమీక్షారచన ఉపయోగపడుతుందన్న నేపథ్యంలో ఉదాహరణకు ఒకటి ఈ క్రింద ఇవ్వబడుతుంది. దయచేసి మన పత్రికలో ప్రచురించినట్లయితే పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం

పుస్తక పఠనం సమీక్షా రచన
I.పుస్తకం వివరాలు
1. పుస్తకం పేరు: వనితల కోసం వంటింటి చిట్కాలు
2. రచయిత్రి పేరు: శ్రీమతి శైలి
3. ప్రక్రియ: వచనము
4. వెల:రూ 30
5. సమీక్షకుల పేరు: జాదవ్ శ్లోకేశ్  రావు
6. తరగతి. పదవ
II. పుస్తక సేకరణ
ప్రతిరోజు సాయంత్రం నేను మా వీధిలో ఉన్న జే వి ఆర్ పి గ్రంథాలయానికి పుస్తక పఠనం కొరకు. వెళ్తాను. ఒకరోజు పుస్తక పఠనం చేయుటకు వనితల కోసం వంటి చిట్కాలు తీసుకున్నాను. పుస్తక పఠనం చేసి సమీక్ష చేశాను.
III. పుస్తక పరిచయ వాక్యాలు
ఈ పుస్తకం చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ముఖచిత్రం కూడా పుస్తకం పేరుకు తగిన విధంగా ఉంది. చదవాలని ఆసక్తిని కలిగిస్తుంది. ముద్రణ కూడా చక్కగా ఉంది. పుస్తకం ధర సామాన్యులకు అందుబాటులో ఉంది
IV విషయ వివరణ
వనితల కోసం వంటింటి చిట్కాలు అనే ఈ పుస్తకములో 75 శీర్షికలతో అనేక అంశాలతో కూడుకున్న చిట్కాలు ఉన్నాయి. ఒక్కొక్క చిట్కా ఒక్కొక్క అంశానికి సంబంధించిన ప్రత్యేకతను తెలియజేస్తుంది.
ఉదాహరణకు కొన్ని పరిశీలిస్తే ఈ విధంగా శీర్షికలు ఉన్నాయి.
ఇంటి వైద్యం, అత్యవసర చిట్కాలు, గ్యాస్ ఆదా చిట్కాలు, పచ్చని చెట్లు తోడుంటే...... చిట్కాలు, వంటి అనేక చిట్కాలు ఉన్నాయి.
వనితలు ఈ చిట్కాలను ఉపయోగిస్తే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదని పిస్తోంది.
V. ముగింపు
ఈ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం. గృహిణులకు ఎంతో సాయ కారిగా ఉంటుంది. ప్రతి ఒక ఇల్లాలు ఈ పుస్తకం చదివి, అనేక చిట్కాలను తెలుసుకొని ఆరోగ్యకరమైన జీవితం ఇంటిల్లిపాదికి అందించాలని నా అభిప్రాయం.

కామెంట్‌లు