సినీ నిర్మాత వీరయ్య గారు పల్నాటి యుద్ధం సినిమా తీస్తూ దానిలో పద్యాలు రాయడానికి జాషువా గారిని ఎన్నుకొని మద్రాసు పిలిపించి వారి ప్రక్కన నన్ను డాక్టర్ వెంకట్ రాజు గారిని ఉంచి రాయించుకున్న సందర్భంలో కళ్లనీళ్లతో చెప్పిన సందర్భం అది. తిరుపతి కవులు చెప్పినట్టుగా నాకు అదృష్టం తప్ప కలం చేతబట్టి వ్రాయగలిగిన సత్తా లేదనే కదా తన అభిప్రాయం అప్పటికే బ్రాహ్మణులు తప్ప మరెవరు కవిత్వం రాయడానికి సరి రారు అన్న అభిప్రాయం బలంగా నాటుకొని ఉంది దానిని అబద్ధం చేస్తూ నిజజీవితంలో జరిగిన అనేక సంఘటనలతో అనేక బహుమతులతో బిరుదులతో అలరారిన జాషువా గారిని ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించడం చాలామందికి మింగుడు పడని విషయం. వారి జీవితంలో కన్నీరు కార్చిన మొదటి ఘట్టం అది జాషువా గారికి కవితా విశారద కవి చక్రవర్తి విశ్వకవి సమ్రాట్ కళా ప్రపూర్ణ మొదలైన ఎన్నో బిరుదులు జీవితంలో పొందిన తాను మొదటి సన్మానంలో అందుకున్న పదిసార్లు పెసలు తన సొంత ఊరిలో మొదటిగా జరిగిన సన్మానంలో పొందిన 116 రూపాయల బహుమతి ఆయనకు గొప్ప అనుభూతి ఆ రోజులలో కాశీనాథుని నాగేశ్వరావు పంతులుగారు ప్రారంభించిన భారతి పత్రికలో కవిత గాని రచన కాని రావడం చెప్పుకోదగిన విశేషం వారు ఎంతో అనుభూతితో వ్రాసిన నాటకం రుక్మిణి కళ్యాణం చదువరులకు ఎంతో గొప్పగా నచ్చిన రచన సత్య హరిశ్చంద్ర నాటకంలో జాషువా గారు హరిచంద్రుని పాత్రలో పరకాల ప్రవేశం చేయకపోతే ఆ రచన అంత సొంపుగా మన ముందుకు వచ్చి ఉండేది కాదు. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని స్వయంకృషితో చదువుకున్న ఆంధ్రప్రదేశ్ లోనే తిరుగులేని మహాకవిగా అవతరించాడు ఆంధ్ర భాషలో ఖండకావ్యాలు రాయాలి అంటే జాషువా గారే అన్న పేరు తెచ్చుకున్నారు వీరు రాసిన గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్మహల్ క్రీస్తు చరిత్ర వంటి రచనలు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టాయి హిమాలయ శిఖరాల కంటే ఉన్నతమై గంభీరమైన హృదయం కవి కోకిల జాషువాది అని మహాకవి దాశరథి మాటలు అక్షర సత్యాలు భారతీయ భాషా సంస్కృతి, సంప్రదాయం అంటే వారికి గొప్ప అభిమానం దేశ నాయకులను గురించి స్వాతంత్ర్య సమరయోధులను గురించి అనేక కవితలు రాసిన వారు జాషువా గారు మాతృ భాషను, మాతృభూమిని, జన్మనిచ్చిన మాతను మరువని మరపురాని వ్యక్తి జాషువా.
జనకవి జాషువ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి