ఈ ప్రపంచంలోకొచ్చిన ప్రతి ఒక్కరూ విజ్ఞానిగా రాలేరు ఈ భూమి మీదకు వచ్చిన మరుక్షణం నుంచి ఏదో చెప్పడానికి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ ప్రాణి అతని ఊహకు అందని విషయాలన్నిటిని మొదటగా తల్లి ఎంతో నేర్పుగా ఆ పసితనానికి తెలిసేలా ప్రథమ గురువుగా ప్రవర్తిస్తుంది దానితో మానవ సంబంధాలు ఏమిటో ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో వారి పట్ల తాను ఎలా ప్రవర్తించాలో సక్రమంగా తెలియజేసేది మాతృమూర్తి నడకతో పాటు నడతను కూడా నేర్పగలిగిన సామర్థ్యం ఉన్నవాడు తండ్రి మాత్రమే వీరిద్దరి విద్యాబుద్ధులను సొంతం చేసుకుని ప్రపంచంలోకి తల ఎత్తుకొని రాగలిగిన వ్యక్తి అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానిలో సఫలీకృతుడు కూడా అవుతాడు. తనకు తెలిసిన వారు బంధువులు తమ గ్రామంలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడం భగవంతుని పూజించడం తన ఇంటి తో పాటు చాలామంది ఇండ్లలో పూజలు పునస్కారాలు జరుగుతూ ఉండడం తాను చూడడం తప్ప ఎందుకు అలా పెడుతున్నారో ఇలా చేస్తున్నారో అర్థం కాదు ఏ గుడిలోకి వెళ్ళిన అక్కడ సాకారమే ఎవరు ఏ భగవంతుడిని లేదా ఏ భగవతిని పూజించాలి అని అనుకుంటారో ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించి ఒక పురోహితుని ద్వారా తన కోరికలను తెలియజేస్తూ తాము పూజిస్తూ ఉంటారు ఆ స్వరూపాన్ని ఎందుకు అలా పూజిస్తున్నారు దాని వెనుక ఉన్న విషయం ఏమిటి ఒకరు ఇద్దరు కాదు కదా చాలామంది ఇలా చేస్తున్నారు దానికి మూలం ఏమిటి అన్న ఆలోచనలో పడతాడు దాని పరిష్కారాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తాను వేరుగా ఉన్నాడు భగవంతుని స్వరూపం వేరుగా ఉన్నది అలా ఉండడానికి కారణాలను అన్వేషిస్తున్న సమయంలో ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలను తెలిసిన గురువులను ఆశ్రయించి వారి ద్వారా అసలు విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాడు ఈ ప్రపంచమంతా నీవు నేను అనే తలుస్తూ ఉంటారు నిజమైన భక్తి కలిగిన యోగి ఆ భగవత్ స్వరూపం నేనే అహం బ్రహ్మాస్మి అన్న నగ్నసత్యాన్ని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది ద్వైతంలో నీవు నేను వేరువేరు అన్న జ్ఞానాన్ని మరచి నీవే నేను అన్న శంకరాచార్యుల వారి ద్వైతాన్ని ఎప్పుడు ఆశ్రయించావో ఆ సత్యాన్ని తెలిసిన మరుక్షణం నీవు ముక్తిని పొందినట్లే అంటున్నాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.
"జీవుని దెలసిన దనుకను దేవుని భ్రమ బొదలు నరుడు దేవుడు దలపన్ జీవుండని వివరించిన భవింపక ముక్తి బట్టబయలుర వేమ...."
"జీవుని దెలసిన దనుకను దేవుని భ్రమ బొదలు నరుడు దేవుడు దలపన్ జీవుండని వివరించిన భవింపక ముక్తి బట్టబయలుర వేమ...."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి