చింతయే యోగి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణివిజయవాడ కేంద్రం,9492811322.
 ఈ భూమిపై బడ్డ ప్రతి ప్రాణి మంచి చెడు ఆలోచించి సమాజానికి తనకు ఏది మంచి జరుగుతున్నదో దాని గురించి ఆలోచించి  ఆ పద్ధతిలో తన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ప్రయత్నిస్తాడు  భౌతికంగా తనకు కావలసిన అవసరాలను తీర్చుకోవడం కోసం  నిద్రపోవడానికి ఇల్లు తినడానికి ఆహారం కట్టడానికి బట్ట  కనీస అవసరాలుగా గుర్తించి వాటికోసం ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి  తన కుటుంబాన్ని  పోషించుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో తనకు ఎదురైన అనేక రకాలైన  సమస్యలను ఎదుర్కొంటూ  మంచి వాటిని  మంచిగా చెడ్డవాటిని చెడ్డగా ఎదురు  నిలిచి పోరాడి  తన కుటుంబానికి కావలసిన  అవసరాలన్నిటినీ తీరుస్తూ ఉంటాడు ఇది ఎలా వచ్చింది? ఎందుకు తీసుకువచ్చారని  భార్య కూడా అడిగే స్థితిలో ఉండదు. భౌతికంగా తన అవసరాలన్నీ తీరిన తర్వాత  మానసికంగా కొన్ని కోర్కెలకు  చిక్కుకొని  ఆ సాలి గూడిలో ఇరుక్కొని  జీవిత ధ్యేయం మరచి  ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిన వ్యక్తి  ఆ సుఖాలలోని  చివరి సుఖాన్ని కూడా చూసిన తర్వాత  వీటిలో ఎందుకు చిక్కుకున్నానో  దీనివల్ల నాకు నా శరీరానికి ఏమైనా  ప్రయోజనం ఉన్నదా  కనక సుఖాల కోసం  జీవితాన్ని ఇలా వృధా చేయడం సబబా  అన్న ఆలోచన వచ్చి బయట చేయవలసిన పనులన్నీ నాకు తెలుసు లోపల చేయవలసినవి ఏమిటి  అని ఆలోచించి అయోమయ స్థితిలో ఉన్న అతనికి  మంచి మిత్రుల ద్వారా ఫలానా గురువును ఆశ్రయించినట్లయితే నీకు అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేస్తారు అని చెప్పగా అక్కడికి వెళ్లి వారి పాద పద్మాలను ఆశ్రయిస్తాడు.
ఇతను ఆశ్రయించిన గురువుగారు  ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు చేయ  వలసిన ప్రతి పనిని  ఎలా చేయాలి ఎందుకు చేయాలి అన్న విషయాన్ని అతనికి చెప్పకుండా  దేనిని అనుసరిస్తున్నాడో దానిని పరిశీలించి  దానిని అనుసరించమని  మిగిలిన విద్యార్థుల వల్ల తెలుసుకొని  పద్మాసనం లో కూర్చోవడం  మొదలు  తమ నసును తను అధీనంలో ఉంచుకొని భగవత్   ధ్యానం చేస్తూ గురువుగారు చేసిన పద్ధతిలో  తాను కూడా నిత్యం అలవాటు చేసుకొని  ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు  అలా మతాలకు అతీతంగా మనస్సును మాత్రమే నమ్మి  భగవంతునిలో లీలమయ్యే అవకాశం ఉంటుంది అని వేమన తెలియజేస్తున్నాడు ఆయన రాసిన పద్యాన్ని చదవండి.

"లోను బయలుజేసి లోకంబు దె గటార్చి కులముగాలబెట్టి గుణము వదలి చింతలోని చింత జేరిన యోగిరా..."



కామెంట్‌లు