ఈ సమాజంలో మనం గమనించినట్లయితే తక్కువ పనిచేసి ఎక్కువ లాభాన్ని పొందాలనే వ్యక్తులు అసలు ఏ పని చేయకుండా ఫలితం పొందాలన్న మనుషులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కృషిచేసి సంపాదించిన దాని విలువ వీరికి తెలియదు ఒక రైతు చెట్లను నాటి పరిశుద్ధమైన గాలిని పొందడం కోసం ఆ చెట్టుకు సంబంధించిన విత్తనాలను తీసుకుని వచ్చి నానబెట్టి తరువాత నాటడానికి ప్రయత్నం చేస్తాడు ఆ విత్తనాన్ని తినడానికి చీమలు ప్రయత్నం చేస్తాయి ఆ విత్తనం మొలవడం ప్రారంభించి కొంచెం పచ్చగా పైకి వచ్చిన తర్వాత పక్షులు దానిని తినాలని దానికోసం ఎగబడతాయి ఆ మొలక మరి కొంచెం పైకి లేచి కంటికి ఇంపుగా పచ్చగా కనిపిస్తే పశువులు వాటిని తినాలని చూస్తాయి.
వీటి బారి నుంచి తప్పించడానికి యజమాని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ మొక్క వృక్షంగా తయారైనప్పుడు దానిని ఆహారంగా చేసుకోవాలని ప్రయత్నించిన చీమలు పక్షులు, పశువులు అన్ని నీడ కోసం ఆ చెట్టు కిందకి వస్తాయి మానవ జీవితం కూడా అలాగే ఉంటుంది కాలం కలిసి వచ్చేంతవరకు ఓపిక పట్టడం ప్రథమ కర్తవ్యం జీవితంలో అనేకమంది స్నేహితులుగా బంధువులుగా మిత్రులుగా కలిసి ఉండడానికి వస్తారు మధ్యలో వెళ్లిపోయిన వారిని గురించి మనం ఆలోచించకూడదు మనతో ఉన్నవాళ్లు శాశ్వతంగా ఉంటారు అని కూడా మనం భావించకూడదు నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరో వచ్చి దానిని తీరుస్తారు అని అనుకోవడం భ్రమ నీకు నీవే ధైర్యం చెప్పుకోవాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలి. లోకులు కాకులు లాంటి వాళ్ళు మనిషిని చూడరు మనసును కనరు వ్యక్తిత్వాన్ని చూడాలనిపించదు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు దానికి తగిన మాట అనేస్తారు ఒక్కొక్కసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి అన్న విషయం తెలియదు మరొకసారి చెప్పుడు మాటలు వల్ల మన ఆలోచనలు తారు మారవుతాయి అలాగే జీవితంలో నేను ఇది కావాలి అనుకోవడం కూడా పొరపాటే మన జీవితంలో ఒక కష్టం కన్నీళ్లు సంతోషం బాధ ఏవి వచ్చినా అవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్లు కలగలిసినదే జీవితం ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్ప దెబ్బలు తిన్నారా ఈ విగ్రహంగా మారుతుంది కానీ దానిని చెక్కిన శిల్పి అలాగే ఉండిపోతాడు.
నమ్మి చెడిన వాడు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి-విజయవాడ కేంద్రం,-9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి