ఈ భూమిపైకి వచ్చిన ప్రతిబిడ్డ నిండు నూరేళ్లు ఆనందంగా హాయిగా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటుంది చిన్నతనంలో ఉన్న అలవాటు వేరు వయసు పెరిగిన తర్వాత ఒకరకంగా వృద్ధాప్యంలో మరో రకంగా ప్రవర్తించడం సహజం చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రతి బాల ఆడపిల్ల కానీ మగ పిల్లవాడు కానీ తాను అందంగా ఇతరులకు కనిపించాలన్న కోరికతో ఎన్నో అలంకారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కట్టే బట్ట నుంచి వాడే ప్రతి వస్తువు అందంగా ఉండాలి ఖరీదైనదిగా ఉండాలి ఇతరులు వాడే దానికి భిన్నంగా ఉండాలి అని ఆలోచిస్తారు కొంచెం వయసు పెరిగి బాధ్యత తెలిసిన తరువాత ఆలోచనలు వేరే ఉంటాయి ఇతరులను ఆకర్షించడానికి తాను ఎలాంటి పనులు చేయాలి అనుకుంటూ ఉంటారు. అదే వయసు పెరిగిన తర్వాత ఇతరులు ఏ పని చేసినా తనకు నచ్చదు వారిని పిలిచి తన పద్దతులను చెబుతూ అలా కాదు ఇలా ప్రవర్తించండి ఇలా దుస్తులను ధరించండి అని సలహాలు ఇస్తూ ఉంటాడు కానీ ఏ ఒక్కరూ ఆ ముసలి వాని మాటలు విని ఆచరించిన పాపాన పోరు సహజంగా ప్రతి వ్యక్తిలో జరిగే పద్ధతులు ఎలా ఉంటాయో లోకో భిన్న రుచికి అన్నట్లు ఎవరి అభివృద్ధి వారికి ఎవరి అలవాట్లు వాడికి శాశ్వతంగా నిలిచిపోతాయి ఎవరిని ఎవరు అనుకరించరు అనుసరించరు ఇది ప్రత్యేకించి యవ్వనంలో మరీ అధికంగా ఉండడం సహజం మరి ఈ జీవి ఏం చేయాలి? ఎలా జీవించాలి ఏ పద్ధతులను అవలంబిస్తే తన జీవితానికి ముక్తి లభిస్తుంది అని ఆలోచిస్తే వేమన చెప్పినదే సత్యం అనిపిస్తుంది
ఈ శరీరాన్ని ఎన్ని రకాలుగా ఏ పద్ధతిలో పోషించిన అది చివరికి మట్టిలో కలిసిపోవలసినదే ఇది అందరికీ తెలిసిన నిజం కనుక అది మట్టిలో కలవకముందే ఈ మానవుడు చేయవలసిన పనులు ఏవో వాటిని సక్రమంగా చేస్తే చాలు అని చెప్తున్నాడు వేమన వీరు తక్కువ వారు ఎక్కువ అన్న భేద భావం మనసు నుంచి దూరం చేసి అంతా తన సహోదరుడే ఒక కుటుంబ సభ్యులు అన్నట్లుగా ప్రవర్తిస్తూ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకొని జీవితాన్ని కొనసాగించే వ్యక్తి తాను ఏదైతే నమ్మాడో దానిని సాధించడం కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు ముక్తి లేక కైవల్యం కావాలని కోరుకున్న మనిషి తన మనసును ఏకాగ్రతతో మునిలా మననం చేసుకుంటూ ఋషులా ఆచరిస్తూ ఉంటే మోక్షాన్ని సాధిస్తాడు అని చెప్తున్నాడు వేమన ఆ పద్యాన్ని చదవండి.
"ఈ దేహమెన్ని భంగుల బ్రోదియునొనరించ నేల పోవుట కాదే మీ దెరిగి మురికి గడుగుచు బేధంబులుమాన ముక్తిబెరయుర వేమ..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి