ఉరిశిక్షను తప్పించుకున్న అట్లూరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణివిజయవాడ కేంద్రం,9492811322.
 1949 వ సంవత్సరం మార్చి 29వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడ పూరి ప్యాసింజర్ రైలు  లో తుపాకులు ధరించిన ఇద్దరు పోలీసులు ఓ పాతిక సంవత్సరాల కుర్రవాడిని తీసుకొని రాజమండ్రి వెళ్లేందుకు రైలు  ఎక్కారు  తుపాకీ ట్రిగ్గర్ మీద వేలు పెట్టి అప్రమత్తంగా ఉన్న ఆ ఇద్దరు పోలీసులు నడుము నిశ్చలంగా నిర్భీతిగా కూర్చున్న  యువకుడు అట్లూరి పూర్ణచంద్రరావు  వారికి ఎదురుగా ఇద్దరు రైతులు కూర్చున్నారు  వారిని రైతులు అనడం కన్నా రైతు వేషాల్లో కూర్చున్నవారంటే బాగుంటుంది  పోలీసులు మాత్రం వారిని నిజంగానే రైతులు అనుకుంటున్నారు పోలీసుల మధ్య ఉన్న యువకునికి మాత్రమే తెలుసు రైతుల వేషంలో కూర్చున్న సహచరులు అని రాజమండ్రి సెంట్రల్ జైలలో ఉరిశిక్ష అమలు చేయడానికి తీసుకు వెళుతున్న తనను తప్పించడానికి అనుసరిస్తున్న సాహసోపేతులు  వారు.
ఏలూరు వెళ్లేసరికి  భోజన సమయానికి  కిందకు దిగినప్పుడు  అట్లూరి వారు నేను మరో  ఒకటి రెండు రోజుల్లో ఎలాగూ భూమ్మీద సజీవంగా ఉండను నా వద్ద 5000 రూపాయలు ఉన్నాయి వీటిని నేనేం చేసుకోను వీటితో మీ ఇష్టం వచ్చినట్టు తినండి అంటూ పోలీసులకు కొంత డబ్బులు ఇచ్చాడు  ఆ పోలీసులందరూ రకరకాల మాంసాలతో తనివి తీరా భోజనాలు చేశారు మాంసం తిన్న బుక్తాయాసంతో ఒకడికి నిద్ర పట్టింది  రిజర్వడ్ హెడ్ కానిస్టేబుల్ మాత్రం ఇతనికి కాపలాగా ఉన్నాడు. అప్పుడు రిజర్వ్ కానిస్టేబుల్ అట్లూరిని అడిగాడు  నువ్వేమైనా పారిపోదలచుకున్నావా అంటే అదేం లేదు అన్నాడు  పారిపోతే తనకు అభ్యంతరం లేదని అన్నాడు కానిస్టేబుల్  ఇది తనను పరీక్షించడానికి అన్నట్టుగా అనిపించింది  అట్లూరి వారికి.
రెండో కానిస్టేబుల్ కి నిద్ర మెళకువ వచ్చింది  అప్పుడు సమయం నాలుగు గంటల అయ్యింది లేస్తూనే కంగారు పడసాగాడు ఆ సమయంలో రాజమండ్రి  వెళ్లడానికి రైలు లేదు  రాత్రి 7 గంటలకు ఉంది  లబలబలాడుతున్నాడు కానిస్టేబుల్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా కారు మాట్లాడండి వెళ్దాం అన్నాడు  సరే మేము రాజమండ్రి కదా వెళ్లాలి  మేం కూడా కారులోనే వస్తాం చెరి సగం డబ్బులు ఇద్దాం అని వారితో వస్తున్న రైతులు అన్నారు  అప్పుడు ఆ ముగ్గురు రైతుల మొహాల్లో ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషం  సరిగ్గా కారు ప్రయాణంలోనే మనవాడిని తప్పించాలని చక చకా పథకాన్ని రచించారు రైతులు  ఏలూరులో తమ స్నేహితుడైన కాంట్రాక్టర్ తో మాట్లాడారు

కామెంట్‌లు