అమ్మలకు అమ్మ;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 వెన్నెలకంటి రాఘవయ్య గారు సలహాదారు   చతుర్వేదుల రాఘవయ్య గారు  అంటే వారు కనకమ్మ గారి గురువుగారు  వారి జీవితకాలం ఈ సమాజానికి కనకమ్మ గారికి ముఖ్య సలహాదారులుగా ఉన్నారు.  వీరి కుమారుడే చతుర్వేదుల వెంకటకృష్ణయ్య గారు  వీరు కూడా పోట్లపూడిలోనే కనకమ్మ గారి  తోటి విద్యార్థిగా తన తండ్రి వద్ద విద్యను అభ్యసించారు  పోట్లపూడిలోనూ పరిసర గ్రామాలలోనూ కలరా స్పుటక జ్వరాలు విజృంభించినప్పుడు సంఘ సభ్యులు మందులు తెప్పించి రోగులకు అందజేసి  ఉపచర్యలు చేసేవారు  వీరి సేవలు నిరాటంకంగా దళిత ఓడలకు కూడా అందుతూ ఉండేది. ఆ రోజులలోనే  కుల మతాలకు అతీతంగా  అందరూ నా సోదరులే అన్న పద్ధతిలో కనకమ్మ గారు వ్యవహరించారు.
నేను ఉన్నత పాఠశాలలో చదువుతున్న రోజులలో మా గ్రామంలో గోరా గారు గోపరాజు రామచంద్ర రావు గారు  మూడు రోజులు  విడివి చేసి మాలపల్లి మాదిగ గూడెం ఉప్పర  పేటలో ప్రచారం చేయడానికి మా ఇంట్లో విడిది చేశారు  ఒకరోజు మాటల సందర్భంలో గాంధీ గారి గురించి ఒక విషయం  చెప్పారు  అడిగాను అంతా నా సోదరులు అని గాంధీ చెప్పిన తరువాత హరిజనవాడలో ఒక కుటుంబంలో భోజనానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది  ఆ ఇంటి గృహిణి  వేరుశనగ పప్పులు వొలిచి ఇస్తే  వాటిని స్వీకరించలేదు  నేను ఏమి తినను భోజనం కూడా చేయను  ఒక మేకను తీసుకువస్తే దాని పాలు తాగుతాను అన్నారు  ఆమె చెంబు తీసుకొని పాలు తీయడానికి బయలుదేరితే  అలా కాదమ్మా మేకను తీసుకురా నేనే తాగుతాను అన్నారు. ఇది గాంధీ గారిని విమర్శించడానికి చెప్పిన విషయం కాదు నగ్న సత్యాలను బయట పెట్టాలన్న అభిప్రాయంతోనే చెప్పాను అన్నారు గోరా  గారు  చెప్పినదే చేస్తాను చేసినది చెబుతాను  అని అనేకమంది చెపుతున్న మాటల్లో  నిజం లేదు అని తేటతెల్లమవుతుంది  చెప్పకుండానే  తన మెదడులో వచ్చిన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి  అందరూ నా సహచరులే ఏ ఒక్కరిని భేదంగా చూడవలసిన అవసరం లేదు ఈ భూమి మీదకు తల్లి గర్భం నుంచి అంతా ఒకే మాదిరిగా వచ్చాం అన్నది ప్రమాణం  కనకమగాడు ఆ రోజుల్లోనే  అంత ఆదర్శంగా కార్యక్రమాలను నిర్వహించారు అంటే  అది సంచిత జన్మ ఫలమే తప్ప  ఈ జన్మలోది కాదు అని వేదాంతులు చెబుతారు.

కామెంట్‌లు