ప్రజ్ఞాశాలి నండూరి- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఒక పర్యాయం ప్రభుత్వ  ఆహ్వానం మేర  రష్యా పర్యటనకు వెళ్లి వచ్చారు రామ్మోహన రావు గారు  అక్కడ సాంఘిక  పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అది  రష్యా నుంచి తిరిగి వచ్చిన తర్వాత  ఆకాశవాణిలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ  ఏ పర్యటన అయినా తాను సొంతగా చేస్తే  తనకు కావలసిన విషయాలను  అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప  ప్రభుత్వం తరఫున వెళ్లిన వాటికి  ఆ అవకాశం ఉండదు దానికి కారణం వారు ముందే నిర్ణయించుకుని స్థలాలను  అభ్యుదయభావాలతో ముందుకు వెళ్లిన పరిస్థితులను  మనకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు  తప్ప  విమర్శలకు చావు ఉండదు  అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి నండూరి వారు.
బాపు రమణలు చెన్నైకి చేరకముందే  విజయవాడలో వారు లబ్ద ప్రతిష్టులు  రమణ మాట  బాపు గీత  ఒకటే  ఇద్దరివి ఒకే రకమైన ఆలోచనలు  హాస్య రసానికి ప్రథమ సోపానం  ఇచ్చినవారు వారిద్దరే  మొదట  బాపు గారి తమ్ముడు శంకర్ నారాయణ గారు  మా విజయవాడ కేంద్రంలో పని చేస్తూ ఉండేవారు  చివరి తమ్ముడు నారాయణ  ప్రింటింగ్ ప్రెస్ పెట్టి  మంచి మంచి పుస్తకాలను ప్రచురిస్తూ ఉండేవాడు  రామ్మోహన రావు గారికి ఆ కుటుంబ సభ్యులందరికీ  చిరపరిచితులే  మాటల సందర్భంగా  శంకర్ నారాయణ గారిని  ఆకాశవాణి ఉద్యోగ భద్రతలను గురించి  ప్రస్తావిస్తూ  మీకు అనేకమంది  మనస్తత్వాలతో పరిచయాలు ఉన్నాయి  వాటిని రచనల ద్వారా  వ్యక్తీకరిస్తే బాగుంటుంది అని  సలహా ఇచ్చాడు రామ్మోహన రావు గారు. నేను రాయడం ఏమిటండి  నా జీవితంలో జరగనిది అదొక్కటే  ఏదైనా విషయం చెప్పమంటే చెప్తాను తప్ప రాయలేను  అనగానే  పుట్టుకతోనే ఎవరు నేర్చుకోరు. సాధన వల్ల  వారు పేరు ప్రఖ్యాతి పొందుతారు.  అన్నగారి లాగా మీరు కూడా  చిన్నచిన్న కార్టూన్లు వేయండి  మన పత్రికలో  ప్రతిరోజు ప్రచురిస్తాను  అని వారితో  స్త్రీల గురించి కొన్ని వందల  హాస్యాలను  ఆంధ్రజ్యోతి ద్వారా అందించి  నూతన రచయితలను  ప్రోత్సహించిన వారు  నండూరి వాడు  నండూరి సుబ్బారావు గారితో కూడా  నాటికలను నవలలను  వ్రాయించిన  కీర్తి రామ్మోహన్ రావు గారికి దక్కుతుంది  సుబ్బారావు గారి మాటల్లోనే కాదు  రాతల్లో కూడా  పూర్తి హాస్యం ఉంటుంది  ఎంత ఆలోచిస్తే  అంత హాస్యం మనకు దొరుకుతుంది  అలాంటి అన్వేషి నండూరి వారు.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం