అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 చతుర్వేదుల రాఘవయ్య గారు గొప్ప నిష్టాపరులు చక్కని పండితులు కనకమా  గారి చెల్లెలు  ఆదెమ్మ కుమార్తె వెంకట సుబ్బమ్మలకు చదువు చెప్పడానికి ఆయనను నెల్లూరు నుంచి తీసుకొని వచ్చి పోట్లపూడిలో ఉండేలా ఏర్పాటు చేశారు  ఒకనాడు దళితవాడలో ఒక మనిషికి కలరా సోకిందని కబురు వచ్చింది  సంఘ సభ్యుడు ఎవరూ ఊరిలో లేరు కనకమ్మ గారికి ఏమి పాలు పోక రాఘవయ్య గారి దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పింది  వారు వెంటనే స్పందించి మందులను పత్యానికి కావలసిన సరుకులను తీసుకొని దళిత వాడకు వెళ్లి  కాళరాత్రి కి స్వయంగా మందులు అందించి  మూడు గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు  స్నానం చేసి జపం చేసుకొని  వంట చేసి భుజించారు. మరొక పర్యాయం ఎంతో జాలి కొలిపే సంఘటన జరిగింది  ఒకే సమయంలో ఆ ఊరి మాలవాడలో  పిల్లలు పెద్దలు సహా అందరికీ ఇన్ఫ్లుఎంజా జ్వరం సోకింది ఇళ్లలో ఉన్న జనాభా అంత  పడక వేశారు ఆ సమయంలో కనకమ్మ ఇంట వంటవాడు కూడా పడక పెట్టారు  ఆ ఉపద్రవ సమయంలో ఏవైనా సరే జరా బాధితులను ఆదుకోవాలని నిశ్చయించుకుంది కనకమ్మ గారు  వాడలో రోగులందరికీ కావలసిన అంత జావ తల్లి సహకారంతో తయారుచేసి దానితో పాటు మందులు ఇచ్చి పంపించండి  రోగగ్రస్తులు స్వస్థత పొందే వరకు ఈ కార్యక్రమం కొనసాగింది  ఇలాంటి సాంఘిక సేవ నిరతి కలిగిన మాతృమూర్తులు  మనకు అరుదుగా కనిపిస్తారు.  సృజన సభ్యులంతా 1912 విజయదశమి ఉత్సవాన్ని  పోట్లపూడిలో వైభవంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ హరిజన ఉద్దరణకు నడుం బిగించక ముందే  1912 వ సంవత్సరం నుంచి  ఈ పునకా కుటుంబం  ఆ అత్యున్నత ఘనకాయానికి నడుంబిగించారు  మహాత్మా గాంధీ 1916 తర్వాతే సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చారు  చతుర్వేదన వెంకట కృష్ణయ్య వెన్నెల కంటి రాఘవయ్య పాటూరు రామసుబ్బయ్య పులక పట్టాభిరామిరెడ్డి మరుపూరు పిచ్చిరెడ్డి నెల్లూరు వెంకట రామానాయుడు ఆయన సోదరుడు అంతా కలిసి  సెమీ వృక్షం వద్దకు చేరారు  రాయప్రోలు సుబ్బారావు గారి ఉత్తర శ్వసము పేరా కొన్ని పద్యాలు రాసి రామానాయుడు చేత చదివించారు  రాయప్రోలు సుబ్బారావు గారు తృణకంకణం రచనకు  స్ఫూర్తి ఈ సన్నివేశమే  ఆ పుస్తకాన్ని మొదటిసారిగా కనకమ్మ గారి సన్నిధిలో చదివి వినిపించారు కూడా.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం