నాటకం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
సినిమాలో కానీ బుల్లితెరపై కానీ రేడియోలో కానీ  నాటకాలు విన్న తర్వాత బాగుంది బాగుండలేదు అన్న ఒక మాటతో దాని  బండారాన్ని బయటపెడతారు  దాని వెనక ఎంత కష్టం దాగి ఉందో వారికి తెలిస్తే  ఆ నిర్మాత గానీ, దర్శకుడు కానీ నటించిన నటీనటులు కానీ  ఎన్ని బాధలను ఓర్చుకొని  ఆ పని చేశారో తెలిస్తే  అలాంటి చిల్లర మాటలు రావు ఒక వ్యక్తి ఒక నాటక సంఘాన్ని స్థాపించి  తనకు తెలిసిన నటీనటులను ఒక బృందంగా ఏర్పాటుచేసి నాటకాన్ని వ్రాయడానికి రచయిత కోసం ప్రయత్నిస్తాడు  రచయిత వ్రాసిన నాటికాన్ని  వీరికి కావాల్సిన నాటకాన్ని రచయిత వ్రాయడమా అన్నది ప్రశ్న  తాను ఏ పద్ధతిలో నాటకాన్ని ప్రదర్శించాలనుకున్నాడో రచయితకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పి తనకు కావలసిన పద్ధతిలో వ్రాయించుకోవడం సరైన పద్ధతి. సినిమా, రేడియో, బుల్లితెరపై మనం చూసే కథ ఒక మాదిరిగా ఉండవు ఒకే కథను ఎంపిక చేసిన  ఆకాశవాణిలో ఎంత కుదించడానికి అవకాశం ఉంటే అంత చేసి  తక్కువ మాటలతో ఎక్కువ  అర్థం వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు ప్రయోక్తలు  ఆ తర్వాత  నటీనటుల ఎన్నిక జరుగుతుంది అంతకుముందు ఎవరెవరు దానిలో పాల్గొన్నారు  వారిని పిలవడానికి  మధ్యలో సమయం సరిపోతుందా లేదా అన్న విషయాన్ని కూడా గమనించి వారిని ఎన్నిక చేస్తాడు  ఎప్పుడు బడితే అప్పుడు కార్యక్రమాలను ఇవ్వడం జరగదు  దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి  నటీనటుల ఎన్నికను  చేసేటప్పుడు  ఎవరు ఏ వేషానికి సరిపోతారో  ఆ రసాన్ని పోషించగలిగిన వారిని మాత్రమే ఎన్నుకుంటారు. సాధన మొదలుపెట్టిన తరువాత  ఆ నాటకానికి దర్శకత్వ బాధ్యత తీసుకున్న వారికి  మీరు చదివే పద్ధతి నచ్చకపోతే దానిని మార్చి మరొక పాత్ర ఇచ్చే అవకాశం ఉంటుంది  దానికి ఎవరూ బాధపడవడిసిన అవసరం లేదు అందరి ధ్యేయం  నాటకం చాలా బాగా రావాలి దానికోసం కృషి చేయాలి  నాటకం రికార్డింగ్ అయిపోయిన తర్వాత దానికి హంగులను ఏర్పాటు చేసుకొని  ఎక్కడ సంగీతం ఇవ్వాలి  ఆ అంశానికి సంబంధించిన  కొన్ని రైలు కూతగాని బస్సులో ప్రయాణం కానీ  మరి ఎక్కడో మాట్లాడుకుంటున్న  దృశ్యాన్ని అందంగా తీసుకురావాలంటే దానికి సంగీత సహకారం ఉండి తీరాలి లేకుంటే చెవికి ఇంపుగా ఉండదు  అన్ని జాగ్రత్తలు తీసుకుంటే  చివరకు సమయం 30 నిమిషాలు నాటకం 29 నిమిషాల్లో అయిపోవాలి  అలా లేకుంటే మధ్యలో కొంత తీసివేయవలసి ఉంటుంది. ఇవీ రేడియో వారి సాధక బాధకాలు.

కామెంట్‌లు