ఉరిశిక్షను తప్పించుకున్న అట్లూరి ఏ. బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మా గ్రామం తేలప్రోలు సమీపంలోనే అత్కురు అన్న గ్రామంలో అనేకమంది వామపక్షపాతులు ఉన్నారు.  ఆశయ సాధన కోసం తమ  ప్రాణాలను కూడా ఇచ్చినవారు అత్కురు గ్రామంలో ఉన్నారు  అలా ప్రాణాలు అర్పించిన వారిలో అన్నే రామారావు గారు ముఖ్యుడు  వారి అందరి ఆశయాలకు ఆదర్శంగా నిలబడిన వాడు  అట్లూరి శ్రీమన్నారాయణ గారు  తేలప్రోలు గ్రామంలో ఉన్న విశ్వనాథరెడ్డి గుంటకపుల్లారెడ్డి  లాంటి వామపక్ష పార్టీల  సహకారంతో  పొట్టిపాడు  అంపాపురం వీరవల్లి హనుమాన్ జంక్షన్ లాంటి ప్రాంతాలలో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసి  దేశంసుభిక్షంగా ఉండాలి అంటే  పార్టీ సిద్ధాంతాలను అమలు చేయాలి  అంటూ ప్రచారం చేస్తూ ఉండేవారు. మా కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న కుటుంబం వారిది  శ్రీమన్నారాయణ గారి కుమార్తె  విప్లవ కుమారి  విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో మా అన్నయ్యతో పాటు  చదివింది  ఇద్దరి మనసులు ఏకమై వారిద్దరూ వివాహానికి సిద్ధమైనా కులాల పట్టింపుతో  అట్లూరి వారు అంగీకరించలేదు  దానితో అన్నయ్య వివాహానికి  విముఖులై  చాలాకాలం వివాహ మాడ లేదు వారి అబ్బాయి స్టాలిన్ నాతో పాటు  లైలా కాలేజీకి  చదువుకోడానికి వచ్చి  జీతాలు కట్టడానికి సిద్ధమైన సమయంలో నన్ను  స్టాలిన్ ను  గోరా గోపరాజు రామచంద్ర రావు గారి అబ్బాయి నియంతను  పేరు వల్ల  చేర్చుకోలేదు  దానితో బ్రహ్మానంద రెడ్డి కలుగజేసుకొని నాకు నియంతకు  ప్రవేశం కలగజేశారు  స్టాలిన్ మరో కళాశాలలో చేరాడు. ఈ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడు  నేను కొండపల్లి సీతారామయ్య గారితో ఆడియో రికార్డ్ చేసిన  సంఘటన  తెలియజేయాలి  వామపక్ష సిద్ధాంతాలను  నిజాయితీగా అమలుపరుస్తున్న చైనా ప్రభుత్వాన్ని వదిలి  రష్యా ను ఆదర్శంగా తీసుకున్నారు  అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కొంతమంది రష్యా వెళ్లడం నాకు తెలుసు  అంటే కొండపల్లి  మా అజ్ఞాతవాసానికి  ఎంతో సహకరించి ఆర్థిక సహాయం అందించిన  దేశం అది  కనుక దానిని మర్చిపోవడం  సాధ్యమా  అంటే  డబ్బులు ఇస్తే  వారి సిద్ధాంతాలు ఏవైనా వాటిని అనుసరించడానికి  సిద్ధంగా ఉండాలన్న అభిప్రాయమా  అని ప్రశ్నించినప్పుడు  సమాధానం చెప్పడానికి  పాలు పోక  అలా మౌనంగా ఉండి పోయాడు  అలాంటి తత్వాలను అభినందించాలా.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం