కనకమ్మ గారు బాల్యంలో బడికి వెళ్లి చదువుకోలేదు మేనమామ సుబ్బరామిరెడ్డి గారితో వివాహం కావడం ప్రధాన కారణం ఆ పరిస్థితుల్లో ఆమెకు విద్యను అభ్యసించాలన్న కోరికతో స్వయంకృషితోనే తాను చదవవలసిన పుస్తకాలన్నీ చదివే స్థితికి వచ్చింది మొదట భాగవతం చదవాలనుకుంది వ్యాసుల వారు సంస్కృతంలోనూ పోతన గారు పద్యాలలో వ్రాయడం వల్ల దాని జోలికి వెళ్లకుండా భాగవతాన్ని వచనములో రాసిన పుస్తకాన్ని సంపాదించి చదవడం ప్రారంభించింది దానిలో జీవితానికి కావలసిన అన్ని విశేషాలను కూలంకషంగా అర్థం చేసుకొని ధర్మబద్ధంగా జీవితాన్ని గడపడానికి మార్గాన్ని స్వయంగా ఏర్పాటు
చేసుకుంది ఇది ఎంతో పట్టుదల దీక్ష ఉంటే తప్ప సాధ్యం కాని విషయం అనేక గ్రంథాలను క్షుణ్ణంగా చదివింది కుశాగ్ర బుద్ధి అయిన ఆమె సంస్కృతం హిందీ కూడా నేర్చుకుంది చిన్నతనంలోనే కవిత్వం రాయడం కూడా ఆమెకు వంట బట్టింది ఏదైనా ఒక విషయాన్ని పెద్దల ద్వారా వింటే దానిలోని మర్మాలను తెలుసుకొని జీవితానికి దానిని ఎలా సంతాన పరచుకోవాలో ఆలోచించి ఆ పద్ధతిని అవలంబించేది ఆ రోజులలో హిందూ సుందరి అనసూయ గృహలక్ష్మి అనే పత్రికలు వస్తూ ఉండేవి ప్రత్యేకంగా స్త్రీల సమస్యల గురించి సమస్యలు చెప్పడమే కాకుండా దాని పరిష్కారాలను కూడా సూచించే పద్ధతిలో ఆ పత్రికల ముద్రణ ప్రారంభమైంది ఆ మూటికి కనకమ్మ గారు వ్యాసాలు కవితలు పంపితే వారు తప్పకుండా అచ్చు వేసేవారు చిన్నతనంలోనే చేయి తిరిగేలా కవయిత్రిగా అందరి మన్ననలను పొందింది సమాజంలో ఉన్న కుళ్ళును కడగడానికి తాను ఈ పద్ధతిని అవలంబించి తనతో పాటు అభిలాష కలిగిన వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉండేది.
కనకమ్మ గారి ఆధ్వర్యంలో పోట్లపూడిలో 1913 మార్చి 1వ తేదీన కనకమ్మ గారి మరిది పుణాక పట్టాభిరామిరెడ్డి మరుపూరి పిచ్చిరెడ్డి నెల్లూరు వెంకట రామానాయుడు (వీరు కొనక పట్టాభిరామిరెడ్డి ఇంటి గుమస్తా) పట్నం వెంకటసుబ్బారెడ్డి గంగవరం హనుమారెడ్డి మరి కొందరు మిత్రులు కలిసి సుజన రంజని సమాజం అన్న సంస్థను స్థాపించారు అందరిని విద్యావంతులను చేయాలి అన్న అభిప్రాయంతో ఆ సంస్థ ఆధ్వర్యంలో వివేకానందుల వారి పేరును జ్ఞాపకం చేస్తూ వివేకానంద గ్రంథాలయాన్ని నెలకొల్పారు ఈ సమాజానికి కనకమ్మ గారు తన మరిది పట్టాభిరామిరెడ్డి గారు అధ్యక్షుడు నెల్లూరు వెంకట రామానాయుడు కార్యదర్శి వెన్నెల కంటి రాఘవయ్య గారు సలహాదారు.
అమ్మలకు అమ్మ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి