జనకవి జాషువ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 గోరా గారి పిల్లలు  సమరం విజయం లతో  ఆరుమళ్ళ వేమన్ రెడ్డి (మా  అన్నయ్య) కలిసి  చదవడం  కళాశాల చదువు పూర్తి అయ్యేంత వరకు వారి ఇంట్లోనే ఉండడం  ఒక అదృష్టం  జీవితం క్రమశిక్షణలో ఉండాలి అంటే గోరా గారి శిక్షణ ఉండి తీరాలి  వేమన చదువు అయిపోయిన తర్వాత మా గ్రామంలో  గోరా గారు మూడు రోజుల  కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు  ఒకరోజు మాలపల్లి  ఒకరోజు మాదిగ గూడెం  చివరి రోజు ఉప్పర  వారితో సహపంక్తి భోజనాలు  ఏర్పాటు చేశారు  చివరి రోజు  కార్యక్రమానికి వెళుతూ మార్గంలో ఉన్న  మాస్టారు పాటిబండ శ్రీమన్నారాయణ గారిని కలిసి వారిని కూడా ఆహ్వానిస్తే  దీనికి ప్రత్యేకంగా ఉద్యమం చేయవలసిన అవసరం లేదు  నేను బ్రాహ్మణుడిని  నాకు జంధ్యం లేదు నేను రాను  అన్నాడు. గోరా గారికి ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. చివరి రోజున వేమన రెడ్డి గారి తల్లి  వేరుశెనక్కాయలు వేయించి  ఇస్తే ఓ సంఘటన చెప్పాడు  గోరా గారు  దళితులందరూ నా సోదరుడు అన్న మహాత్మా గాంధీ ఒక దళితుని ఇంటికి  భోజనానికి వెళ్లి  ఆమె పాలు ఇస్తే అది తాగలేదు  నేను మేకపాలు తాగుతాను అన్నాడు  ఆమె గ్లాసు తీసుకొస్తుంటే అలా కాదు  మేకను తీసుకురండి నేను తాగుతాను అని ఆయనే పిండుకుని తాగాడు  ఆశయాలు చెప్పడానికి గొప్పగా ఉంటాయి  చేయడానికి మాత్రం  దూరంగా ఉంటారు  ఎంత పెద్ద వారైనా ఇలాంటి సంఘటనలు  మనకు ఎదురవుతూనే ఉంటాయి  వారిని విమర్శించడానికి చెప్పలేదు ఉన్న విషయాన్ని మీకు చెప్పాను అన్నారు గోరా గారు. చివరి రోజు పగలు  తేలప్రోలు గ్రామం ఉన్నత పాఠశాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి  పెద్దలతో మాట్లాడాలనుకున్నారు  మనం కూడా  పార్టీ లెస్ పార్టీ  అన్న పేరుతో  అసెంబ్లీలో కూడా కొంతమందిని గెలిపించుకొని  వారి ద్వారా  ప్రభుత్వానికి కూడా మన ఆశయాలను తెలియజేయవలసిన అవసరం ఉంది  అని చెప్పినప్పుడు  ఇప్పుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ అన్న పార్టీలు ఉన్నాయి నేను లేచి మనం పార్టీ లెస్ పార్టీ అని పెడితే  ప్రత్యేకంగా అది ఒక పార్టీ కిందకే వస్తుంది కదా  మరి మీ ఆశయం ఎలా నెరవేరుతుంది  అని ప్రశ్నించినప్పుడు సమాధానం లేదు గోరా గారికి  మనమంతా కూర్చుని ఆలోచించి ఒక పేరు ఏర్పాటు చేద్దాం  అని సభను ముగించారు.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం