అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్- ఆకాశవాణి-విజయవాడ కేంద్రం,-9492811322

 దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు దువ్వూరి రామిరెడ్డి గారిలో దేశభక్తిని రగిలించే ఇతివృత్తాలతో స్వప్న ప్రయాణం, మాతృ శతకం పుస్తకాలను వ్రాయించి వారే  ముద్రించే ఏర్పాటు చేశారు.  దీపాల పిచ్చయ్యా శాస్త్రి గారి స్వప్న ప్రయాణంలోని చివరి మేల్కొలుపు పద్యం  చదివితే అప్పటి వారి శైలి మనకు అర్థం అవుతుంది. అల్లనల్లన దిక్కులు తెల్లవారే దీప కలికల మొగవలు తెల్లవారే  తివిరి యామిని బ్రతుకేళ్ల తెల్లవారె నేల ఇంకను నిదురింప మేలుకొనురు.  దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన మాతృ శతకం పద్యాలు  ఇండియా ప్రింటింగ్ వర్క్స్ లో అచ్చు వేయించారు  ఆ రోజుల్లో మాతృదేశ  భక్తి ప్రతి ఒక్కరి నర నరాన జీర్ణించకపోయి ఉన్నది  దానిని అనేకమంది అనేక రకాలుగా వ్యక్తపరిచారు.
రామి రెడ్డి గారి మాతృ శతకంలో ఒక పద్యం  మాతృదేవి బలి మండపమందు యజ్ఞ పశువుగా నిల్చునంతటి భాగ్యమెవరికి సిద్ధించునిందరిలోన  నా మహా పురుషుని యరికాలు దుమ్ము ప్రజల శీరంబికి పద్యంబు చేయు  ఇలాంటి విప్లవాత్మక ధోరణి రచనలను ఆనాటి ప్రభుత్వం  సహిస్తుందా  ప్రభుత్వం వారు ఈ విషయం తెలిసి  మాతృ శతకం ప్రచురణ స్వాధీనం చేసుకుని తగలబెట్టించింది. దీనతో పోట్లపూడి రహస్య  విప్లవోద్యమాన్ని గురించి బయట ప్రపంచానికి తెలిసింది  గదర్ విప్లవ వీరుడు  దర్శి చెంచయ్య జైలు నుంచి విడుదలైన తరువాత  1919లో కనకమ్మ గారిని కలిశారు  విప్లవ రాజకీయాల పట్ల తొలినాళ్లలో ఆకర్షితుడైనా 1919లో గాంధీ దర్శనం తర్వాత కలకమ్మ అహింసా మార్గంలో ప్రస్థానం సాగించారు
1912లో దేశ సేవ పథం ప్రధాన అంశంగా పనిచేసిన సమాజం వారు  యజ్ఞ యాగాదులలో జీవ హింస వహించకూడదనే ఆందోళన  1914లో సంచార గ్రంథాలయాల స్థాపనకు శ్రద్ధ వహించారు  1917 లో జరిగిన సృజన రంజని వార్షికోత్సవ సభలో ఆనాటి  ప్రముఖ నాయకుడైన కాశీనాథున నాగేశ్వరరావు ఉన్నవ లక్ష్మీనారాయణ చిలకమర్తి లక్ష్మీ నరసింహం అయ్యంకి వెంకటరమణయ్య ఆచంట లక్ష్మీపతి దంపతులు అయ్యే దేవర కాళేశ్వరం  కవులు రాయప్రోలు సుబ్బారావు ఆదిపూడి సోమనాథ రావు  మంగిపూట వెంకటశర్మ కుమార్ అలీషా తదితరులు సాహితీ ప్రసంగాలు చేశారు.  గుండవరపు అప్పారావు అన్న యువకుడు  తన విద్య ప్రదర్శన చేస్తానంటే దానిని ఏర్పాటు చేయగా  ప్రేక్షకులను అందరిని అలరించింది ఆకర్షించింది.

కామెంట్‌లు