ఉరిశిక్ష నుండి తప్పించుకున్న అట్లూరి- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి-విజయవాడ కేంద్రం,-9492811322

 ఆ కాంట్రాక్టర్ తో అన్ని విషయాలు మాట్లాడి నమ్మకమైన డ్రైవర్ని ఏర్పాటు చేసుకున్నారు  ఆ డ్రైవర్ కి కొన్ని సూచనలు ఇచ్చారు  కారును తీసుకొచ్చి వసంత మహల్ హోటల్ ముందు రెడీగా పెట్టారు  వారంతా బయలుదేరేటప్పుడు సాయంత్రం ఏడు గంటలు అయ్యింది ముందు సీట్లో డ్రైవర్ తో పాటు రైతులు కూర్చోగా వెనక సీట్లో ఇద్దరు పోలీసులు యువకుడు కూర్చున్నాడు  కారు ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ దాటింది ఇంజన్ హీటెక్కిందని డ్రైవర్ కారు ఆపాడు  అదీ ఇదీ పరీక్షించి  ఇంజన్ ఆరాలి అది చల్లారాలంటే ఒక అరగంట కారు ఇక్కడ ఆపాలి అన్నాడు సన్నగా వెన్నెల వస్తుంది పోలీసులు తుపాకులు కారులో పెట్టి అట్లూరిని తీసుకువచ్చి తమ మధ్య కూర్చోబెట్టుకున్నారు పోలీసులు. సరిగా అదే సమయానికి రైతు వేషాల్లో ఉన్న ఇద్దరు మధ్యలో కలిసిన వ్యక్తి కారులోని తుఫాకులు చేతిలోకి తీసుకొని  పోలీసుల వైపు చూపుతూ వారి కళ్ళల్లో కారం కొట్టారు వారు లాబో దిబో అంటున్న సమయంలో యువకుడు రైతులు మూడో వ్యక్తి చేరి కారులో వెళ్లిపోయారు  పోలీసుల కళ్ళు కప్పి ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న ఆ యువకుడు  మన అట్లూరి శ్రీమన్నారాయణ  ప్రక్కనే వచ్చిన రైతులు జాష్టి బసవరావు, ఓగిరాల మోషే  ఏలూరులో కలిసిన కాంట్రాక్టర్ చిన్న వెంకట్ రాయుడు  ఆ రోజుల్లోనే తన స్వగ్రామం అత్కూరులో రౌడీయిజానికి వ్యతిరేకంగా అట్లూరి ప్రజలను సమీకరించారు  ఆ గ్రామానికి చెందిన ఇద్దరు విజయవాడలో హత్య కాయించబడడంతో అది అట్లూరి చేయించిన పని  అని అతనిపై కేసు పెట్టారు  దానిని తన మిత్రుల సహాయంతో  తప్పించుకున్నాడు.
స్వగ్రామానానికి సర్పంచిగాను పంచాయతీ సమితి అధ్యక్షుడుగాను పనిచేశారు  సిపిఎం లో  గన్నవరం డివిజన్ కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా  ఆ పార్టీ కంట్రోల్ కమిషన్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు  ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోరాటాలు  రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు పొందాయి  తేలప్రోలు వేమన గ్రంథాలయంలో ఆరుమళ్ళ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో  విశ్వనాథ రెడ్డి గుంటక పుల్లారెడ్డి సమక్షంలో  అట్లూరి శ్రీమన్నారాయణకు  ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ  పార్టీని నడప వలసిన తీరును గురించి  సమాజానికి ఉపయోగపడే పనులు ఎలా చేయాలో తెలియజేస్తూ  అనేక ఉదాహరణలతో  మాట్లాడుకునేవారు  అలాంటివారు పార్టీకి వెన్నుపూస లాంటివారు.
కామెంట్‌లు