ఈ భూమి మీద పెరిగిన ప్రతి వ్యక్తి వయసు వచ్చిన తర్వాత కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని చేయక తప్పదు బాగా చదివిన వాడైతే ఉద్యోగం డబ్బున్నవాడైతే వ్యాపారం ఏమీ లేని వారైతే శారీరక కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తారు ఏ పని చేసినా మనిషికి కావలసినది జ్ఞానం తెలివి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పనులను సునాయాసంగా చేసుకోవచ్చు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్ట లేకపోతే వాడు ప్రారంభించిన ఏ పని పూర్తిగా విజయాన్ని సాధించలేదు వ్యాపార అభివృద్ధి కావాలన్నా ఉద్యోగంలో ముందుకు వెళ్లాలన్న కృషి చేయడం తన తెలివితేటలతో వ్యవసాయాన్ని అందంగా త్వరగా వ్యాపారాత్మకంగా చేయాలన్న తెలివి ఉండి తీరబడిసినదే లేకుంటే సమాజంలో వెనకబడిపోక తప్పదు.
ఈ ప్రపంచంలో జీవించడానికి ఈ తెలివి ఎంత ఉపయోగపడినా భౌతిక ప్రపంచం వీడి వెళ్లిపోయిన ఆత్మ పరలోకంలో సుఖంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఈ తెలివితేటలు ఈ జ్ఞానం చాలవు నీ తెలివి వల్ల ఈ భూమి మీద అనేక రకాలైన సంపాదన కోసం ధనాన్ని కూడ పెట్టాలని అభిప్రాయంతో పెడ త్రోవ తొక్క వలసి వస్తుంది ఆ సమయంలో అది మంచిదా చెడ్డదా అని ఆలోచన కూడా అతనికి రాదు అతని దృష్టి మొత్తం లాభం మీదే ఉంటుంది తప్ప ఎదుటివారి మనస్తత్వాలను గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు అలా చేసిన వారు పాపాలను మూటగట్టుకొని ఈ లోకంలోనే నరకాన్ని అనుభవించే స్థితికి వస్తారు తప్ప భగవంతుని సాక్షాత్కారాన్ని పొంది ముక్తి చెందే ఆస్కారమే లేదు.u
ప్రళయానికైనా ప్రళయం లేదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కానీ దానికి కూడా పరమాత్మ జ్ఞానం ఉంది తీరవలసినదే అంటాడు వేమన ఆత్మ పరమాత్మల దాన్ని తెలుసుకోవాలన్న జ్ఞానం అంత తొందరగా మానవాళికి వంట బట్టదు శరీరంలో శక్తులుడిగి చేయడానికి పాలు పోని స్థితిలో ఈ ప్రపంచంలో ఉన్న మనలను నడిపించే శక్తి ఏదో ఒకటి ఉన్నది అన్న జ్ఞానం మొదలవుతుంది అప్పుడు దానిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అది మనకు చెప్పడానికి సరి అయిన గురువును ఎన్నుకుంటే వారి అనుభవం వల్ల వారు తెలుసుకున్న బ్రహ్మజ్ఞాన స్వరూపాన్ని వీడికి తెలియజేయడానికి వీలవుతుంది ఆ మార్గాన్వేషణలో సాధన చేసి ముందుకు వెళితే పరబ్రహ్మ స్వరూపం తెలుస్తుంది మోక్షానికి అర్హత పొందుతాడు అంటూ వేమన వ్రాసిన పద్యాన్ని ఒకసారి చదవండి.
"ఇందు నెరుక వాని ఇహ పరములు లేవు ప్రాణహానిలేదు ప్రళయమునకు ప్రళయ కాలమైన పరమాత్ము గలయరా..."
ప్రళయం- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి