అలనాటి నటుడు వడ్లమాని విశ్వనాధం.- డా.బెల్లంకొండనాగేశ్వరరావు. చెన్నయ్ .9884429899.
 వేదిక నుండి  వెండి తెరకు .
సినిమారంగంలో వేలమంది కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దానిలో ప్రముఖపాత్రలు పోషించినవారే నటులుగా గుర్తింపు పొందారు. వారిపైన చాలామంది సినీ రచయితలు పలు వ్యాసాలు రాసారు.కాని చిన్ననటులు ఉదాహరణకు,బొడ్డపాటి-నల్లరామ్ముర్తి-సీతారామ్ - జగ్గారావు-త్యాగరాజు-చదలవాడ కుటుంబరావు-లంకాసత్యం- డా.శివరామకృష్ణయ్య-కామరాజు-  దురైస్వామి -పిల్లికళ్ళనారాయణరావు-మహంకాళి వెంకయ్య-కోళ్ళసత్యం- కె.యస్ .శర్మ వంటి వారితోపాటు, మరెందరో నటీ మణులు  పలువురు చిన్న  సిని కళాకారులు చరిత్రలో అందరికి అందకుండా  మనకు తెలియకుండా వెళ్ళిపోయారు. అటువంటి చిన్నతరహా కళాకారులు వేదికనుండి వెండి తెరకు వెళ్ళిన వారిని పరిచయంచయం చేసే చిన్న ప్రయత్నమిది ఆదరిస్తారని ఆశిస్తాను....ఏమైన తప్పులు ఉంటే తెలియజేయండి సరిదిద్దు కుంటాను.
ఎక్కువగా ముని,పండిత పాత్రలు పోషించిన విశ్వనాధంగారు 1912 సం" తూర్పుగోదావరిజిల్లా అమలాపురం తాలూకా నందపూడి అగ్రహారంలో శ్రీవేంకటశాస్త్రీ,శ్రీమతి మహాలక్ష్మమ్మగార్లకు జన్మించారు.
తన ఆరవఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో ఆదిభట్ల నారాయణదాసు,ద్వారంవెంకటస్వామి నాయుడు గార్ల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించారు.అదే సంవత్సంలో వింజమూరివెంకట లక్ష్మినరసింహా రావుగారి ద్వారా,పెద్దాపురం విద్యావినోదిని నాటక సంస్ధలొ ప్రవేసించారు.చావలి లక్ష్శినారాయణ శాస్త్రి,కేశవరావు ,కామరాజు,
కోఠీ శేషగిరిరావు వంటి వారి సరసన హరిశ్చంద్ర నాటకంలో లోహితుని పాత్రను పోషిస్తూ నాటక రంగంలో ప్రవేసించారు.
అనంతరం కాకినాడ లోని యంగ్ మెన్స్ హేపి క్లబ్ లో చేరి చిన్నికృష్ణుడు, ప్రహ్లాద,ధ్రువ,మార్కండేయ,లవుడు మెదలగు బాలపాత్రలు చేయసాగారు. అలా బాలకృష్ణుని మెదలు భక్తరామదాసు వరకు,చిత్ర మెదలుకొని చింతామణి వరకు స్త్రీ పాత్రలతో సమంగా పురుషపాత్రలు ధరిస్తూ వందలాది నాటకాలు నాటి ప్రముఖ నటీ,నటులు అందరి సరసన నటించారు.
 అదే కంపెనీలో రేలంగి,ఎస్.పి.లక్ష్మణస్వామి,ఏ.వి.సుబ్బారావు వీరికి మంచి మిత్రులుగా ఉండేవారు.అనంతరం 1935 వరకు పారుపల్లి సుబ్బారావు.బలిజేపల్లి,సి.యస్.ఆర్.గార్లతో పలునాటకాలు ప్రదర్శించారు.1937 అనారోగ్యంతో నాటకరంగానికి దూరమై కొంతకాలానికి సినిమా రంగంలో ప్రవేసించారు. 
జానపద-పౌరాణిక చిత్రాలలో దాదాపు వీరు మునిగా,బ్రాహ్మణుడుగా, పండితుడిగా ఎన్నో రకాల పాత్రలు వందల సినిమాలలో కనిపిస్తారు అన్ని అతిథి పాత్రలే!అలా ముపై సంవత్సరాలు వెండితెరపై వెలుగొందారు.1973 మార్చ18 వతేదిన మద్రాసు రాయపేటలోని వైద్యశాలలో తుది శ్వాస వదిలారు.

కామెంట్‌లు