.వేదిక నుండి వెండి తెరకు .
కళలు మానవకళ్యాణం కొరకు సృష్టించబడినవి.వందల సంవత్సరాలుగా మానవుడి జీవితంలో భాగమై పోయాయి.ప్రజావళికి ఆనందాన్ని, విజ్ఞానాన్ని ,అందించే కళాకారులు ధన్యజీవులు.
29/3/1969 లో విడుదలైన ' లవ కుశ ' చిత్రంలో గిరిజ తండ్రిగా నటించి
' వల్లనోరి మామ నీపిల్లని ' పాటలో కనిపించే శివరామకృష్ణయ్యగారు 1899ఆగస్టు 28 న కృష్ణాష్టమి నాడు గుంటూరుజిల్లా లోని తెనాలిలో జన్మించారు.
విశాఖపట్నంలో మెడిసన్ చదివేరోజుల్లో ఓ నాటక సమాజంలో చేరగా ప్రముఖ రంగస్ధల నటుడు ' కొచ్చర్లకోట రంగారావు ' గారి పరిచయం కలిగింది.అప్పుడు ' జగన్మిత్ర నాటక సమాజం ' వారి నాటక ప్రదర్మనలలో ,జయపురంరాజా విక్రమ దేవవర్మ, బాకురాపాండ వెంకటరావు, వంటి ప్రముఖ రంగస్ధల నటులు మంచి గాత్రం కలిగిన శివరామకృష్ణయ్య గారిచే వేదికపై పాటలు పాడించేవారు.అలా రంగస్ధలం పరిచయం వీరికి జరిగింది. అనంతరం1923 లోవీరు ఎల్ .ఎమ్ .పి.పట్టా పొందారు.స్వంతంగా ప్రాక్టీస్ పెట్టి వైద్యం చేస్తూనే ,నాటకరంగానికి సమయం కేటాయించేవారు.అప్పుడే బళ్ళారి రాఘవా, యడవల్లి, డి.వి.సుబ్బారావు, మల్లాది గోవింద శాస్త్రి, రాళ్ళబండి,కొచ్చర్లకోట,జొన్నవిత్తుల,దైతా గోపాలం ,గోవిందరాజుల వెంకట్రామయ్య,పారుపల్లి సుబ్బారావు,అద్దంకి,సూరిబాబు,మాధవపెద్ది, గోవిందరాజుల సుబ్బారావు,రఘరామయ్య,రాజేశ్వరి వంటి ప్రముఖ రంగస్ధలనటుల సరసన నటించారు.అప్పుడు తెనాలిలో కొంగర సీతారామయ్య గారి హాలులో పలు ప్రదర్మనలు యిచ్చారు. దుర్యోధనుడిగా,రామదాసు,బహుక,చాణిక్య,దుష్ఠబుద్ది,హిరణ్యకస్యపక,రాజరాజనరేంద్ర,బుస్సి,పేరిగాడు,విజయరామరాజు,జనార్ధన మంత్రి,కబీరు,కణ్వుడు,సత్యవంతుడు,భరతుడు,అర్జునుడు,కాశీపతి వంటిపలు పాత్రలు ధరించి వాటికి వన్నె తెచ్చారు.
1923-52 వరకు వైద్యవృత్తిలో కొనసాగారు.' లక్ష్మిఫిలింస్ ' వారు నిర్మిస్తున్న' ద్రౌపతి మాన సంరక్షణము ' 1936 లోఈ చిత్రంలో కర్ణుడి పాత్రద్వారా తొలిసారి చిత్ర రంగానికి పరిచయం అయ్యారు.ఇదేచిత్రంలో శ్రీకృష్టుడిగా బందాకనకలింగేశ్వరరావు,దుర్యోధనుడుగా బళ్ళారి రాఘవా,భీమునిగా మునిపల్లే సుబ్బయ్యవీరు (తెలుగు చిత్రాలలో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన నటుడు చిత్రం ' సతి సులోచన ' (1936) ద్రౌపతిగా సురభి కమలాబాయి(పాతాళ భైరవి చిత్రంలో తొటరాముడి తల్లి) గార్లు నటించారు.
అనంతరం ' నవాబి తుగ్లక్ ' (1941) ' జీవన్ ముక్తి ' ' భలేపెళ్ళి' (1942) పలుచిత్రాలలో నటించి అనంతరం మిలటరీలో కెప్టెన్ గా అస్సాంలో పనిచేసారు.అనంతరం గుంటూరులో వైద్యవృత్తి కొనసాగిస్తు, విజయావారి ' పెళ్ళిచేసి చూడు ' (1952) ' పెళ్ళిసందడి ' (1959) 'వారసత్వం ' (1964) వంటి పలు చిత్రాలలో నటించారు.
నాటక రంగంలో ఏనాడు డబ్బు తీసుకోలేదు,కేవలం కళాభిమానంతో
నేనటించేవారు.పేద కళాకారులకు తనవంతు ఆర్ధిక సహాయం అందించేవారు.ఆనాటి నైజాం నవాబు పాలనలో ఉన్న రేడియోలో తను హర్మోనియం వాయిస్తు అనేక పాటలు,పద్యాలు పాడారు.అనేక పద్యాలు గ్రాంఫోన్ రికార్డులుగా యిచ్చారు.అనేకరేడియో కార్యక్రమాలలో పాల్గోన్నారు. నటనలో అలుపు ఎరుగని ఈకళామూర్తి తన ఎనభైవ ఏట మద్రాసు నగరంలో నవంబర్ మాసంలో తన తుదిశ్వాస విడిచారు.
నటించిన సినిమాలు-పాత్రలు.
భలే పెళ్లి (1941)
జీవన్ముక్తి (1942)
పెళ్ళి చేసి చూడు (1952)
తోడుదొంగలు (1954) - డాక్టర్
అంతేకావాలి (1955)
ఇలవేల్పు (1956)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) - నందాజీ
ఆరాధన (1962)
దక్షయజ్ఞం (1962)
లవకుశ (1963) - చాకలివాని మామ
పరమానందయ్య శిష్యుల కథ (1966) - విరూపాక్షయ్య
ప్రాణమిత్రులు (1967)
సాక్షి (1967)
అల్లుడే మేనల్లుడు (1970)
ఒక నారి - వంద తుపాకులు (1973) - కొత్వాల్ కోటిలింగం
మేమూ మనుషులమే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి