సూరవరపు వెంకటేశ్వర్లు. వేదికనుండి-వెండితెరకు.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ . 9884429899.
 1916 లో గుంటూరు జిల్లా బాపట్లలో సూరవరపు వారు జన్మించారు. పద్మశ్రీ స్ధానం నరసింహారావు గారి జననం కూడా ఇక్కడే జరగడం విషేషం.ఇద్దరూ స్త్రీపాత్రధారణలో తిరుగులేని పేరుపొందిన వారే!
మైలవరం బాలభారతి సమాజం నిస్తేజంగా ఉన్నసమయంలో దైతా గోపాలం గారు 1931 లో ' సతీ సక్కుబాయి ' నాటకాన్ని రాయించి, ప్రదర్మించడానికి పూనుకున్నప్పుడు సక్కుబాయి అత్త జమునాబాయి పాత్రకు స్త్రీ పాత్ర సమర్ధవంతంగా గయ్యాళితనం ఉట్టిపడేలా చేయగలిగే నటుడు లభించక ఆనాటకం ఆగింది.సూరవరపు స్త్రీ పాత్రలపై జనానికి మంచి ఆదరణ ఉన్నదని తెలుసుకుని వారిని తమ సంస్ధలోనికి ఆహ్వానించారు.
సక్కుబాయి విజయవాడలో ఎన్నిమార్లు ప్రదర్శించినా మూడురోజుల ముందుగానే టిక్కెట్లు అమ్ముడు పోయేవి. ఆనాటకం విజయవంతం కావడానికి ముఖ్యులు సూరవపువారే! ఆనాటకంలో అడుగడుగునా సక్కుబాయిని అమితంగా రాచి రంపాన పెట్టే పాత్రఅది దానికి ప్రాణం పోసారు వీరు.అంత కాఠిన్యమే ఆపాత్రకు లేకపోతే నాటకం విజయవంతం కాదు.
అత్త పాత్రలో ఆయన నడక,కాఠీన్యం కలిగిన గొంతుక,హావభావాలు ప్రేక్షకులను సమ్మోహితులనుచేసేవి. బ్రాహ్మణ విధవరాలు వేషంలో ఆగాలుచేస్తూ,రాగాలుతీస్తూ బుగ్గన చేయి చేర్చి విస్తుపోఏలా నటిస్తూ రంగస్ధల ప్రవేస,నిష్క్రమణలకు ప్రేకకులు ఊగ్రులై ఊగిపోతుండేవారు.
అలా ' చింతామణి ' ' పాదుక ' ' విప్రనారాయణ ' ' ధరణికోట ' వంటి నాటకాలలో మంచి స్త్రీ పాత్రధారిగా తెలుగు నాట పేరుపొందారు.అదే సమయంలో భారత్ లక్ష్మి పిక్చర్స్ కలకత్తవారు,చారురాయ్ దర్శకత్వంలో  ' సతీసక్కుబాయి '  నిర్మిస్తూ  ఆచిత్రంలో అత్త జమునాబాయి పాత్రకు సురవరపు వారిని ఎంపిక చేసారు.శ్రీకృష్ణుడుగా 
తుంగల చలపతి రావు,దాసరి కోటిరత్నం సక్కుబాయిగా నటించారు.
ఈచిత్రంలో దాదాపు యాభై పాటలు ఉండటం విషేషం.ఈచిత్రం 21/ మే /1935 న విడుదలై విజయంతం అయింది.అనంతరం యస్ .వరలక్ష్మి, 1954. అంజలిదేవి నటించిన 8/అక్టోబర్  /1965 .మరో రెండు సతీ సక్కుబాయి  చిత్రాలు నిర్మింపబడి విజయం సాధించాయి.
అలా తెలుగు చలన చిత్ర సీమలో తొలి స్త్రీ పాత్రను పోషించిన పురుషుడిగా వీరిపేరు లిఖించ బడింది.ఎందరినో పరిశీలించి వీరిని ఎంచుకున్నారంటే ఆపాత్రపై వీరికి ఎంత పట్టుఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
వీరు రంగూన్, కలకత్తా,టాటానగర్,బొంబాయి, మైసూరు,బెంగుళూరు, మద్రాసు వంటి అనేక మహానగరాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖ హిందీ నటులైన దుర్గఖోటే,గోవిందరావు టాంబేల ప్రసంశ సత్కారాలు అందుకున్నారు.
హీజ్ మాస్టర్స్ గ్రాంఫోన్ కంపెనీలో సక్కుబాయి, రాధాకృష్ణ ,
భక్తపుండరీకాక్ష నాటకాలను సెట్టుగా,విడివిడిగా గ్రాంఫోన్ రికార్డులు ఇచ్చారు.
తెలుగునేల అంతటా వందల ప్రదర్శనలు ఇచ్చారు. డా.సర్వేపల్లి రాథాకృష్ణా,టంగుటూరి ప్రకాశం పంతులు,చల్లపల్లి రాజా గార్ల కొరకు ప్రతేక ప్రదర్శనలు ఇచ్చి వారిచే స్వర్ల,రజిత పతకాలు అందుకున్నారు.తెలుగు నాటకరంగానికి చివరి దాక అమోఘమైన సేవలందిన మహనీయుడు మన సూరవరపువారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం