జంధ్యాల గౌరినాధ శాస్త్రి. వేదికనుండి-వెండితెరకు.;- సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .9884429899.
  గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పిడమర్రు గ్రామంలో5/10/1911 న ఆగర్బ శ్రీమంతుల ఇంట జన్మించారు.పెద్దగా చదువు అబ్బలేదుగాని కళలపట్ల బాగా మక్కువ ఉండేది.
డా.గోవిందరాజుల సుబ్బారావు,ముదిగొండ లింగమూర్తి,గౌరినాధ శాస్త్రి గార్లు మంచి స్నేహంగా తెనాలి పట్టణంలో కలసి మెలసి తిరుగుతుండేవారు. ఈముగ్గురు మిత్రులు కొద్దిపాటి నెలల తేడాలో మద్రాసులో అడుగు పెట్టారు.
మంచిరూపము, చక్కని అభినయము, పద ప్రయోగంలో విషిష్టత కలాగిన శాస్త్రి గారు తొలిసారి ,కావలి గుప్తా గారు లక్ష్మిఫిలింమ్స్ పేరిట ' దౌపతి మాన సంరక్షణము ' చిత్రంలో జంధ్యాల వారికి అవకాశం కలిగించారు. ఇందులో బందా కనకలింగేశ్వరరావు శ్రీకృష్ణుడుగా,బళ్ళారి రాఘవా ధుర్యోధనుడుగా,మునిపల్లె సుబ్బయ్య భీముడుగా,సురభి కమలాబాయి (పాతాళభైరవిలో తోటరాముడు తల్లి) ద్రౌపతిగా డా.శివరామకృష్ణయ్య గారికి కూడా ఇది తొలి చిత్రమే! (లవకుశలో గిరిజ తండ్రి) కర్ణుగా నటించారు.  
' ద్రౌపతి వస్త్రాపహరం ' అనె చిత్రానికి పోటీగా తయారైన చిత్రం ఇది. 1936/మార్చి/24  వ తేదిన విడుదలైనది.
అనంతరం వాహినీ వారి ' భక్తపోతన ' (1942) చిత్రంలో శ్రీనాధుడిగా నటిస్తూ పద్యాలు గోప్పగా పాడుతూ,మంచి అభినయం ప్రదర్శించారు. దర్శకుడు కే.వి.రెడ్డిగారు తేలిసారి దర్శకత్వం వహిస్తున్నతొలి చిత్రం ఇది.వారి దృష్టికి వచ్చిన శాస్త్రిగారిని నాటకానుభవం లేకున్నా శ్రీనాధుని పాత్రకు ఎంపిక చేసారు.వీరి దర్శకత్వంలో వచ్చిన మరో వాహిని వారి 
' పెద్ద మనుషులు ' (1954) చిత్రంలో ఛైర్మెన్ ధర్మారావు పాత్ర జంధ్యాల వారికి మరింత వన్నెతెచ్చింది.ఈచిత్రం ద్వారా డి.వి.నరసరాజు మాటల రచయితగా పరిచయం చేయబడ్డారు.
అనంతరం పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో 'మాయమఛ్ఛీంద్ర '( 1945) జంధ్యాలవారు నటించారు.నటుడు ముక్కామల కు ఇది తొలిచిత్రం. అనంతరం శోభనాచలవారి ' భీష్మ' (1944) చిత్రంలో భీష్ముని పాత్రలో జీవించారు. నటి జూ"శ్రీరంజని "గారికి ఇది తొలి చిత్రం.
సినీరంగంలో జంధ్యాల,ముక్కామలా,ఎస్.వి.రంగారావు మంచిమిత్రులుగా ఉండేవారు.జంధ్యాల వారు నిర్మాతగామారి త్రిమూర్తి బేనర్ పైన' గీతాంజలి ' (1948)' గుణసుందరి కథ ' (1949) ' ఆకాశరాజు ' (1951) (జానపదం) చిత్రాలు నిర్మించారు.
దర్శకుడు జ్యోతిసిన్హ.ఆవేటి పూర్ణిమ(అక్కినేని వారి అందాలరాముడు చిత్రంలో పడవలో బామ్మ పాత్రధారి) అనే ఏలూరుకు చెందిన అమ్మాయిని కథానాయకిగా పరిచయంచేయడం కోసం ' ఆకాశరాజు ' చిత్రం తీసారు. మూక్కామలా సలహపై కొత్తగూడెంలో లాయర్ గా ఉన్న ' మంత్రవాది శ్రీరామమూర్తి కి పూర్ణిమ సరసన కథానాయకుడు పాత్రఇచ్చారు. కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ఈచిత్రానికి మాటలు రాసారు.ఆచిత్రం ఆర్ధికంగా విజయం సాధించక పోవడంతో ఆస్తి అంతా పోగోట్టుకుని జంధ్యాల వారు రోడ్డుపాలైయ్యారు.
మందుకు ,పూర్ణిమకు దాసుడుగా మారిపోయాడు.ఒక రోజు బాగాతాగి పూర్ణిమ కొరకు ఏలూరు వెళుతూ రైలులో సృహతప్పగా ప్రయాణీకులు ఆయనను బంధువుల ఇంటికి చేర్చారు. అలా ఆయన చరిత్ర అక్కడితో 7/5/1964. లో ముగిసింది.జంధ్యాలవారి మనవడు(కూతురు కుమారుడు) రాంబాబు బాపువారి ' త్యాగయ్య ' చిత్రంలో శ్రీరాముడిగా, విశ్వనాధ్ వారి ' సిరిసిరిమువ్వ' చిత్రంలోనూ నటించాడు. ' భలేరాముడు ' (1956) ' జయభేరి ' (1959) వీరు నటించిన చివరి చిత్రం.
కామెంట్‌లు