శైలపుత్రీ దుర్గాదేవి - " కవిమిత్ర" శంకరప్రియ , శీల ,--సంచార వాణి: 99127 67098
 🪷శైల పుత్రివి నీవె!
 వృషా రూఢవు నీవె!
     నవదుర్గా రూపిణి!
 శ్రీమాతా శివాని!
      (శ్రీమాత పదాలు, శంకర ప్రియ.,)
🌻శ్రీమాత  పరమేశ్వరి... దాక్షాయణి యగు సతీదేవిగా దేహమును త్యజించినది. తరువాత, లోక క్షేమము కోరి, దేవతల కార్యార్థమై; హిమవంతుని తపఃఫలముగా అవతరించింది. ఆమెకు.... "శైల పుత్రి" అని, " హైమవతి" అని పేరు.
👌పార్వతీ దేవి... పర్వత రాజు కూతురు. కనుక, "గట్టు రాయని పట్టి" అని; " గట్టు రాకొమరిత" అని, అచ్చ తెలుగు పదములు!
    "ప్రధమం శైల పుత్రీ చ!" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గాదేవీ మూర్తులలో మొదటిది .. "శైల పుత్రీ దుర్గ"!
🚩తేట గీతి పద్యము    
      తెలిసి మదిలోని, కోర్కెల దీర్చు తల్లి!
      యర్ధచంద్రుండు తలపైన, నలరు తల్లి
     వృషభగామి! శూలమును ధరించు తల్లి 
      శైలపుత్రి! యశస్విని జయము తల్లి!
    ( రచన: అవధాని, కోట రాజ శేఖర్.,)
🔆ఓం శ్రీదుర్గ! జయ శ్రీదుర్గ! జయజయ శ్రీదుర్గ!
      (శ్రీదుర్గామాత షోడశ (16) నామ మాలిక.,)

కామెంట్‌లు