కాలరాత్రి దుర్గ!- "కవిమిత్ర" శంకర ప్రియ., శీల., -సంచార వాణి: 99127 67098
 👌కాలరాత్రివి  నీవె!
     సౌఖ్యదాత్రివి నీవె!
     నవదుర్గా రూపిణి!
              శ్రీమాతా శివాని!
     ( శ్రీమాత పదాలు.,)
🔱శ్రీమాత.. శాంతి సౌఖ్య ప్రదాయిని! కాల స్వరూపిణి! భూతకాలము అనగా.. గడచినది. భవిష్యత్ కాలము అనగా.. రాబోవునది.  వర్తమాన కాలము అనగా.. జరుగు చున్నది. మూడు కాలముల స్వరూపమే.. పరాశక్తి యొక్క విశ్వ రూపము!
        "కాలరాత్రీ దుర్గ".. కాలమును హరించునది. గాఢాంధకారము వలె నల్లని రూపము గల దేవి! కనుక, "కప్పు ముతైదువ" అని, అచ్చ తెలుగు పదము. కాలరాత్రి.. భయానక మైన రూపముతో; గార్దభము ( గాడిద ) వాహనంగా, సంచరించు చుండును! కాని, ఎల్లప్పుడూ సాధకులకు.. శుభముల నొసంగు చుండునీ దేవత. కనుక "శుభంకరి" అని పేరు.
🔱"సప్తమం కాలరాత్రీతి" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో ఏడవది .. "కాలరాత్రి దుర్గ"!
 🚩ఓం శ్రీదుర్గ! జయ శ్రీదుర్గ! జయజయ శ్రీదుర్గ!
    ( శ్రీదుర్గామాత షోడశాక్షరి నామమాలిక.,,)
     🚩ఉత్పల మాల
    నల్లని రూపమందున గనన్ భయరూపిణిగా నిరంత ర
    మ్ముల్లము నందు నాగ్రహము నొప్పగ కంటక భూషణావళిన్
    తల్లడమంద జేయుచును దైత్యుల మర్దన జేసినట్టి ఆ
    చల్లని తల్లికిన్ నతులు సద్గుణదాయిని కాళరాత్రికిన్ !
     [డా. రఘుపతి శాస్త్రుల.,]
        ******************
        🚩తేట గీతి పద్యము
     నిజముగా జీవకోటికి నీవె ధాత్రి!
     ఆశ్రయించిన భక్తుల కభయ ధాత్రి
     వీవె! గార్దభ వాహన! హే త్రినేత్ర!
    కరుణజూడు శుభంకరి! కాళరాత్రి!
      [ అవధాని, కోట రాజశేఖర్ ]
కామెంట్‌లు