🔱శ్రీమాత పరదేవత
నవదుర్గల లీలల
పరమార్థం వినరండి!
ఓఆత్మ బంధువులార!
( ఆత్మబంధు పదాలు., శంకర ప్రియ.)
శ్రీదుర్గా భవాని... శైలపుత్రీ దుర్గ (1), బ్రహ్మచారిణీ దుర్గ (2), చంద్రఘంటా దుర్గ (3), కూష్మాండా దుర్గ (4), స్కందమాతా దుర్గ ,(5), కాత్యాయనీ దుర్గ (6), కాలరాత్రీ దుర్గ (7), మహాగౌరీ దుర్గ (8), సిద్ధిదాత్రీ దుర్గ(9), .....మున్నగు, తొమ్మండుగురు దుర్గాదేవీ మూర్తులుగా; అవతరించినది! "నవదుర్గా స్వరూపిణీ నామములు", సృష్టి కర్త యైన, బ్రహ్మదేవుడు.. పరమ భాగవతోత్తముడగు మార్కండేయ మహర్షికి ఉపదేశించారు! వీటిని స్మరించి, అమ్మను శరణు వేడినవారికి.. ఆపదలు తొలగుతాయి! వారికి.. శోకము, దుఃఖము.. మున్నగువాటి నుండి భయము ఉండదు! వారిని..శ్రీమాత కంటికి రెప్పలా కాపాడు చున్నది!
🔱నామమాలా స్తుతి:-
ప్రథమం శైలపుత్రీచ - ద్వితీయం బ్రహ్మచారిణీ!
తృతీయం చంద్రఘంటేతి - కూష్మాండేతి చతుర్థకమ్!!
పంచమం స్కందమాతేతి - షష్ఠం కాత్యాయనీతి!
సప్తమం కాలరాత్రీతి - మహాగౌరీతి చాష్టమమ్!
నవమం సిద్ధిదాత్రీచ - నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని -
బ్రహ్మణైవ మహాత్మనా!
( అధ దేవీకవచము, హరిహర బ్రహ్మ విరచితం )
🚩సీస పద్యము
సంకల్పబలముతో సాధించు దీక్షయే
"శార్వాణి" పార్వతీ "శైల పుత్రి"!
విద్యతో "విజ్ఞానవేత్త"గా రాణించ
పట్టుదలను గల్గు "బ్రహ్మ చారి"
నిండుకుండను బోలు నీతి నియమాలతో
చల్లని చూపుల "చంద్ర ఘంట"
భీష్మించి కార్యాల "కూష్మాండి" తలపుల విజయము చేకూర్చు ప్రీతిగాను
కష్టాల తొలగించు గరిమను పెంచగా
శాంతి సౌభాగ్యాల "స్కంద మాత"
కన్యలలో శక్తి "కాంతి ప్రదాత", "కా
త్యాయనీ" స్మరణతో ధనము గూర్చు
దక్షప్రజాపతి తనయగా "సతి"యయ్యె
శంకరార్థశరీర "శ్యామ లాంబ"!
బాలేందురేఖతో ప్రభలను వెదజల్లు
"వృషభవాహిని" మాత! "ప్రేమ దూత"!
కాళేశ్వరుని తోడ "కాళ రాత్రి"కి పూజ
ఘోర భయమ్ములు పారిపోవు!
ఘోర కఠోరమౌ కోరిక సిద్ధించి
కల్యాణ "మంగళ గౌరి" యయ్యె!
*🚩తేట గీతి*
అమ్మ నవరాత్రి పూజలకాది శక్తి
కొమ్మ కొమ్మల హృదయాన కొలువు దీరు
ప్రకృతి "వరపుత్రి" "లలితాంబ" ప్రస్తుతించి,
పాద పద్మాల మ్రొక్కుదు వంగి వంగి!!
[ అవధాని, మాడుగుల నారాయణ మూర్తి., ]

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి