వెన్నెలమ్మ పదాలు- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,-9966414580.
మదిని అసూయ తెగులు
కుటుంబాల్లో  సెగలు
జీవితాల్లో చెదలు
ఓ వెన్నెలమ్మ!

మేలి బుద్ధులు సిరులు
పరిమళించే విరులు
ఫలములొసగే తరులు
ఓ వెన్నెలమ్మ!

మంచి చేసే జనులు
అమూల్యమైన మణులు
సమాజంలో ఘనులు
ఓ వెన్నెలమ్మ!

ఎక్కువైతే దిగులు
అనారోగ్యము మిగులు
విడిచిపెట్టుము మొదలు
ఓ వెన్నెలమ్మ!


కామెంట్‌లు