ఇంటికి రక్షణ గడప- -గద్వాల సోమన్న,9966414580
గడప ద్వారాబంధము
అదే ఇంటికందము 
గడప లేని సదనము
నగవు లేని వదనము

వాకిలి క్రింది భాగము
గడపే  ఉపయోగము
తలుపులకాధారము 
అది లేక వికారము

గడపను పూజించుట
హిందూ సంప్రదాయము
శుభములెన్నొ జరుగునని
ప్రగాఢ విశ్వాసము

గడప లేని గృహములు
ఉండుట సాధ్యమేనా!
అవే లేక పోతే
భద్రతే  ఉండునా!


కామెంట్‌లు