తేనెలూరు తెలుగు;- -గద్వాల సోమన్న,9966414580
అక్షరాల కలయిక
పదాలతో వేడుక
దేశ భాషలందున
తెలుగు భాష హారిక

పద పదమూ మధురము
నుడికారము అందము
తెలుగు భాష అంటే
జుర్రుకొనును అధరము

అద్భుతమే భావము
అలరించును రాగము
తెలుగు వెలుగు బ్రతుకున
చూపించును మార్గము

తేనెలూరు పదములు
సంగీత సరిగమలు
వీనులవిందు చేయు
తెలుగుభాష మనసులు

వెలుగే ఘనమైనది
తెలుగే విలు

వైనది
కల్గించే మోదము
వెలిగించే దీపము

మాతృభాష మంచిది
కొనియాడిన  క్షేమము
తేట తెలుగు చూడగ
దీవెనలకు నిలయము

కామెంట్‌లు