డబ్బుకు లోకం దాసోహం;- -గద్వాల సోమన్న,9966414580
నమ్మ కూడదు డబ్బులు
తెచ్చిపెట్టును చిక్కులు
ఎక్కువైతే బ్రతుకున
దోచునోయ్! సుఖశాంతులు

బంధాల్ని త్రుంచుతుంది
కుటుంబాల్ని కూల్చుతుంది
డబ్బుకు దాసోహమే
లోకం వెంట నడుస్తుంది

గర్వాన్ని పెంచుతుంది
వినయాన్ని తరుముతుంది
విచ్చలవిడితనంతో
కాని పనులు చేయిస్తుంది

డబ్బు అవసరమే కానీ
అదే ధ్యాస కాకూడదు
లేనిపోని వాటితో
శాంతిని కోల్పోకూడదు

కామెంట్‌లు