దీపావళి " ఔట్లు ";- -గద్వాల సోమన్న,9966414580
దీపావళి వచ్చింది
అనందాన్ని తెచ్చింది
నాన్న ఔట్లు తెచ్చాడు
అందరికీ ఇచ్చాడు

ఔట్లు పెద్దగ ప్రేలాయి
నిప్పు రవ్వలు రాలాయి
పాపకు భయం వేసింది
గట్టిగా తను ఏడ్చింది

ఔట్లు కుంది మరోపేరు 
టపాసులని అంటారు
దీపావళి బాణసంచా
ఇష్టంగా కొంటారు

ఔట్లు పేలితే కనువిందు
వీధి వీధిని సంబరము
వాటి శబ్దం పసందు
తాకుతుంది అంబరము


కామెంట్‌లు