ఖరం అంటే గాడిద;- -గద్వాల సోమన్న,9966414580
ఖరం అంటే గార్ధభము
కరం అంటే చేతులు
మొదటిది పెంపుడు జంతువు
రెండోది   తనువున భాగము

అశ్వ జాతికి చెందినది
గాడిద మరో నామము
బరువులు మోయు సాధనము
పూర్వ కాలమున వాహనము

వైద్యానికి ఖరం పాలు
చాలా చాలా మేలు
గాడిదతో లాభాలు
ఉండునోయి  వేనవేలు

ప్రయాణానికి అనుకూలము
గాడిద అరుపు భీకరము
కంచర గాడిద ఉన్నది
దీనికి కాస్త మిన్నమది

దానికి వెనుకల ఉంటే
ఎంతో ఎంతో ప్రమాదము
కాళ్లతోన తన్నిందా
మేనుకు  ఖాయం గాయము


కామెంట్‌లు