పూలతో దండ కట్టాలి
దేవుని మెడలో వేయాలి
గురువుకు దండం పెట్టాలి
పిల్లలు బడిలో ఉండాలి
శ్రద్ధగా చదువులు చదవాలి
ఏకాగ్రతయే నిలపాలి
ఉన్నతంగా ఎదగాలి
ఎదిగిన కొద్దీ ఒదగాలి
వేళకు నిద్దుర లేవాలి
శుచిగా స్నానం చేయాలి
ఉతికిన బట్టలు తొడగాలి
చక్కగా బడికి పోవాలి
పెద్దలను గౌరవించాలి
బుద్ధులు దిద్దుకోవాలి
శుద్ధిగా మదిని ఉంచాలి
హద్దులు దాటక ఉండాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి