చూడు చూడు తూనీగలు
చక్కనైన తూనీగలు
గాలిలోన చక్కర్లు
కొట్టి తిరుగు తూనీగలు
పెద్ద పెద్ద రెక్కలతో
పొడవైన తోకలతో
కన్నుల పండుగ చేయును
చిక్కకుండా విహరించును
తూనీగలు కీటకాలు
చేయును వింత శబ్దాలు
అవి కావా! అందానికి
అసలు సిసలు ఆనవాలు
ఆడి ఆడి అలసిపోయి
నేల మీద వాలిపోవు
ముచ్చట పడి వెంటపడిన
తప్పించుకుని పారిపోవు
తూనీగల రెక్కలేమో
మనోహరమైన అల్లిక
వాటిని పట్టుకోవాలని
పిల్లలకు భలే కోరిక
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి