కలహాలు మానాలోయ్
కలకవరం వీడాలోయ్
కరుణాంతరంగంతో
క్షమాగుణం చాటాలోయ్!
కలతలన్ని తరమాలోయ్
కక్షలన్ని కాల్చాలోయ్
కాంతులీనే పథంలో
శాంతి పూలు విరియాలోయ్
కన్నీరు తుడవాలోయ్
పన్నీరుగా మారాలోయ్
సన్నజాజి తావుల్లా
అన్ని దిశల ప్రసరించాలి
కఠినత్వం కరగాలోయ్
కరుణ రసం పొంగాలోయ్
కడిగిన మేలి ముత్యాలై
క్రొవ్వొత్తిలా వెలగాలోయ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి