సన్నజాజి;- -గద్వాల సోమన్న,9966414580
సన్నజాజి విరిసింది
సువాసనలు రువ్వింది
చక్కనైన మోదంతో
హృదయాలను గెలిచింది

జడలోన ఒదిగింది
మెడలోన అమరింది
మగువల మనసుల్లో
స్థానమే పొందింది

మాలగా మారింది
గుడిలోన చేరింది
భగవంతుని సేవలో
త్యాగగుణం చాటింది

సన్నజాజి పూల 'టీ'
ఆరోగ్యమిస్తుంది
పెరటిలో పెంచితే
శుభములే తెస్తుంది

సన్నజాజి పందిరిలో
ఆహ్లాదం దొరుకుతుంది
స్వచ్ఛమైన వాయువిచ్చి
రోగాలు తరుముతుంది

ఆయుర్వేద గుణాలు
కల్గినది సన్నజాజి
మేలులెన్నో చేస్తుంది
మేలిజాతి సన్నజాజి

కామెంట్‌లు