"ణ" అక్షర పద గేయం;- -గద్వాల సోమన్న,9966414580
గేయము నా ప్రాణము
సంధించిన బాణము
కూరల్లో లవణము
కారణమ్ము ఇష్టము

వీణ నాదం వోలె
కర్ణాలకు మధురము
ప్రయాణంలో  తోడై
త్రాణ కలుగజేయును

గణ గణ మ్రోగు గంట
క్షణములా విలువైనది
కడుపు నింపే పంట
కరుణలా మృదువైనది

అరుణ కిరణము రీతి
వెలుగులీను గేయము
కణ కణ మండు కణము
ఆలపిస్తే ఘనము

కామెంట్‌లు