చందమామ ప్రేమ పిలుపు...-- -గద్వాల సోమన్న,9966414580
జాబిలమ్మ పిలిచింది
చంద్రయాన్-3 వెళ్ళింది
భారతీయుల బంధము
బహుగా బలపడింది

"చందమామ రావే!"
అని అమ్మ పిలిచినా
ఒకమారు  రాలేదు
పిలవడం మానలేదు

ఎంత పని ఉన్నదో!
మనలనే రమ్మంది
మన ఘన చంద్రయాన్-3కి
స్వాగతం పలికింది

భారతీయుల ప్రతిభ
నలుదిశలా తెలిసింది
భారతమ్మ వదనం
పండు వెన్నెలయింది

చందమామ  వచ్చిన
ఇంత ఘనత దక్కునా!
ఇస్రో శాస్త్రవేత్తల
కృషి ఇల తెలిసేదా!

కామెంట్‌లు