విజయ ఢంకా!;- -గద్వాల సోమన్న,9966414580
విజయ ఢంకా మ్రోగింది
సునాదమునే ఇచ్చింది
వీనుల విందు చేసింది
హృదయాలనే దోచింది

ఢంకా మేలి పరికరము
యుద్ధ వేళలో అవసరము
రాజుల కాలంలోనూ
ఉన్నది దీని వాడకము

రాజు బయలుదేరునపుడు
ఢంకాను మ్రోగిస్తారు
విజయ నాదం చేస్తారు
పెద్దపీట వేస్తారు

ఇంకో పేరు నగారా
డోలు,డమరుకం వగైరా
చర్మ వాయిద్యం ఇది
అలరించును అందరి మది

కామెంట్‌లు