న్యాయాలు -281
శుండా సూచీ న్యాయము
*****
శుండా అంటే తొండము.సూచీ అంటే సూది.
ఏనుగు తన తొండంతో దారిలో క్రింద పడివున్న సూదిని సైతం చక్కగా పైకి తీయగలదు.
ఏనుగు అనగానే దాని భారీ శరీరము, పొడవైన తొండము, చిన్న చిన్న కళ్ళు,చేట చెవులతో "ఏనుగమ్మా ఏనుగు- ఎంతో చక్కని ఏనుగు" చిన్నప్పుడు పాడుకున్న బాం గాయంతో పాటు ఏనుగు భారీ రూపం కళ్ళ ముందు కనిపిస్తుంది.
అలాంటి ఏనుగు గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుని ఆ తర్వాత అసలు విషయంలోకి వెళదాం.
భూమి మీద సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే అతి పెద్ద జంతువు.ఎంతో తెలివైనది.డెబ్బై సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. పూర్తిగా శాఖాహార జంతువు.ఇక ఏనుగులలో మాతృస్వామ్య వ్యవస్థ ఉందని తెలిసి 'భలే!' అనిపించింది.ఆడ ఏనుగు తాను చనిపోయే వరకూ కుటుంబ సమూహానికి నాయకత్వం వహిస్తుందట. ఇవి ఉమ్మడి కుటుంబ సమూహాలుగా,మందలుగా ఉండటం మనకు తెలిసిందే.
మనుషుల్లాగే వాటి మధ్య ఉండే అనుబంధం, ప్రేమ గురించి చదువుతున్నప్పుడు ఆశ్చర్యం ఆనందం కలిగాయి.పెద్ద ఏనుగులు, కొంచెం పెద్ద వయసున్న ఏనుగు పిల్లలు అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల అంటే నవజాత శిశువు చుట్టూ గుమి కూడి తమ తొండాలతో ప్రేమగా తాకుతూ ఆ బుజ్జి ఏనుగు పిల్లను లాలిస్తూ వుంటాయట.సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటాయట.
అలాంటి ఏనుగులను మన పూర్వీకులు ఎప్పటి నుండో మచ్చిక చేసుకొన్నారు .వాటితో పనులు చేయించుకోవడమే కాకుండా సైన్యంలో వాటికి సరైన స్థానాన్ని ఇచ్చి యుద్ధాల్లో ఉపయోగించుకున్నారు.
రాజులు,మహారాజులు ఏనుగు అంబారీపై ఊరేగేవారు. అంతే కాకుండా ఆనాటి మహా రాజులు గొప్ప కవులు, పండితులను గజారోహణంతో,గండపెండేరంతో సత్కరించేవారని మనం చదువుకున్నాం.ఇక దేవాలయాలలో వాటిని పవిత్రమైనవిగా, దేవుని సేవలకు ఉపయోగించడం నేటికీ మనం చూస్తూనే వున్నాం.
ఇక అసలు విషయానికి వద్దాం.ఏనుగులకు చాలా తెలివితేటలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా! అంతే కాదు వాటికి ఎంతో గొప్ప నేర్పరితనం,నైపుణ్యం కూడా ఉన్నాయి. అంత భారీ శరీరము కల ఏనుగులు తమ తొండాలతో చదునైన నేలపై పడి ఉన్న సూదిని కూడా తీయగలవని తెలుసుకున్నాం. అంతే కాకుండా తమ తొండాన్ని నీళ్ళు తాగడానికి, వస్తువులను తీయడానికి, ఒకరికొకరు తాకడానికి, తోటి ఏనుగులను పలకరించుకోవడానికి,కోపం వస్తే తొండంతో చుట్టి విసిరికొట్టడానికి, హెచ్చరికలు చేయడానికి ఉపయోగిస్తుంటాయనేది కూడా ఈ సందర్భంగా తెలిసిపోయింది.
మరి ఈ "శుండా సూచీ న్యాయము" గురించి చెప్పడానికి ఇదంతా అవసరమా? అనిపించవచ్చు. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడే వాటి జీవన విధానాన్ని, ప్రత్యేకతలను గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదాని ఇవన్నీ రాయడం జరిగింది.
ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే మన శరీరాలు భారీవా? బక్క పలుచనివా? పొట్టా?పొడుగా ?అని కాకుండా మనలోని తెలివితేటలు, నైపుణ్యాలే మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇస్తాయని చెప్పడమే ఈ "శుండా సూచీ న్యాయము"లోని ముఖ్యమైన విషయము.
ఇందులోని అంతరార్థం తెలుసుకొన్నాం కదా ! ఇక మనలోని తెలివి తేటలకూ, నైపుణ్యాలకూ పదును పెట్టుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి