పిల్లలను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ; వెంకట్ మొలక ప్రతినిధి

 తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ సూచన 
====================================================
 కిసాన్ బంధు మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కుటుంబ పెద్దను కోల్పోయిన రాధిక తాను ఆత్మగౌరవంతో బతుకుతూ తన పిల్లలని ఉన్నత చదువులు చదివించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం కావాలని తెలంగాణ విద్యావంతుల వేదికను కోరగా. వారు కోరిన విదంగా ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన కుట్టు మిషన్ సుమారు రూ"15, 600 రూపాయల విలువగలిగిన ఎలక్ట్రానిక్ కుట్టు మిషన్ అందించడం జరిగింది.వారు మాట్లాడుతు కుట్టడం లో నైపుణ్యం ఉండడం వల్ల ఈ కుట్టు మిషన్ ద్వారా తాను ఇంట్లోనే ఉండి తన పోషణ మరియు పిల్లలను కూడా మంచిగా చదివించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక వికారాబాద్ జిల్లా నాయకులు గౌరారం గోపాల్  మాట్లాడుతూ కిసాన్ బంధు సతీష్ , స్నేహ విద్యావంతుల వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల జి మనోధైర్యాన్ని పెంచుతున్నందుకు అభినందించారు ఈ కార్యక్రణంలో గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.
కామెంట్‌లు
గౌరారం గోపాల్ చెప్పారు…
మీ వార్తలు వల్ల చాలా మందికి చైతన్యం కలుగుతుందని భావిస్తున్నాను