తీరని కోరికలెన్నెన్నోఆరని మంటలెన్నెన్నోకోరని కష్టాలెన్నెన్నోమారనిది జీవితేఛ్చ ఒకటే!మాయని గాయాలుదరి చేరని గమ్యాలుఅర్థం లేని పయనాలువదిలిపోని అహాలువిరిగినా బెదరకచిరిగినా అదరకసాగిపోయే కెరటాల్లాజారిపోయే క్షణాలుఎదురయే ఆపదలూతప్పని అడ్డంకులుగుచ్చుకునే ముళ్ళూఅన్నీ సహించే జీవితాలుఅనుకున్నది అందకఅందినది అర్థమవకపొందినది మాత్రమేమహా ప్రసాదమనే భావనరేపటి పై నమ్మకంప్రపంచంపై ప్రేమపెంచుకుని పంచుకుంటేఉదయాలెపుడూ ఉత్తేజాలే!మరో మంచి వేకువకు🌸🌸 సుప్రభాతం 🌸🌸
సుప్రభాత కవిత ; - బృంద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి