1)సుతీష్ణం చ అపి అగస్త్యం చ అగస్త్య బ్రాతరం సదా !
అగస్త్య వచ నాత్ చ ఏవ జగ్రాహ ఐంద్రం శరాసనం !
ఖడ్గం చ పరమ ప్రీతః తూణీ చ అక్షయ సాయకౌ !
వసతః తస్య రామస్య వనే వన చరైః సహ!
3)ఋషయః అబ్యాగమన్ సర్వే వధాయ అసర రాక్షసాం !
స తేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే !
శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారం ఆయన నుండి ఇంద్ర చాపమును ఖడ్గమును
అక్షయములైన బాణములు గల తూణీరములను,
గ్రహించి ప్రేమ ప్రీతుడాయెను..వనవాసులతో గూడి
సీతాలక్ష్మణులతో, శ్రీ రాముడు దండకారణ్యమున
నివసించు చుండగా, ఆ పరిసరములలో నున్న, ఋషీశ్వరులు అందరును,తమను సాధించుచున్న
రాక్షసులను వధింపమని కోరుటకై శ్రీరాముని కడకు
విచ్చేసిరి.
శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న
ఆ మునులు యొక్క ప్రార్థనను ఆలకించను.
అగ్ని తుల్యులైన ఆ ఋషీశ్వరుల యెదుట
ఆవనములోని రాక్షసులను అందరినీ యుద్ధమున
మట్టు పెట్టెదను, అని అతడు ప్రతిన బూనెను .
శ్రీ రాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి