కొడంగల్ లోరామకృష్ణ సేవాసమితిి నూతన కమిటీ. ఏకగ్రీవంగా ఎన్నిక;- వెంకట్ మొలక ప్రతినిధి
 అధ్యక్షులుగా బాకారం చంద్రశేఖర్
ప్రధాన కార్యదర్శిగా ఏ ఆనంద్ కుమార్
కోడంగల్ పట్టణ కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తాండూరు రామకృష్ణ సేవాసమితి శాఖ  గౌరవ అద్యక్షులు గాజుల బస్వరాజ్ అధ్యక్షలు బాలకృష్ణ  వారి ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గస్థాయి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్
గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవీందర్ యాదవ్ పాల్గొని 
 మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను సామాజిక విలువలను సమాజ హితం కోసం చేసిన సేవలను కొనియాడుతూ మనమందరం వారి బాటలో ముందుకెళ్లాలని తెలియజేస్థు కోడంగల్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాల విద్యార్థుల శ్రేయస్సు కోసం చైతన్య కార్యక్రమాలు వివిధ పాఠశాలలలో వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలతో పాటు విద్యార్థులు విద్యభ్యాసంలో 10వ 12వ తరగతులలో ఉత్తీర్ణత శాతం  పెంపాండించడం కోసం నిపుణులతో వివిధ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని,పిల్లలు విద్యాను  అభ్యసించడం వలన ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం కోసం అవగాహన కల్పిస్తామని తెలియజేశారు.సామాజిక విలువలు మరియు విద్యా చైతన్యం తో అడుగులు వేయాలని తెలియజేశారు.
 💐నూతన కమిటీ💐
గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవీంద్ర యాదవ్ 
ముఖ్య సలహాదారులుగా 
 రామ్ రెడ్డి MEO,
అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్
ఉపాధ్యక్షులు గౌరారం గోపాల్,
 ప్రధాన కార్యదర్శి ఏ ఆనంద్ కుమార్ (ఆనంద్ బ్రదర్స్)
 కార్యదర్శులు నర్సిరెడ్డి, బొంకూరు 
నరేష్,కాన్ కుర్తి మణికంఠ,శిరుసని రమేష్,
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన సభ్యులను ప్రతినిధులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో
తాండూరు రామకృష్ణ సేవ సమితి ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి ప్రొగ్రామ్ కన్వీనర్ KVMవెంకట్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు