న్యాయాలు -298
శ్వశ్రూ నిర్గచ్ఛోక్తి న్యాయము
*****
శ్వశ్రూ అంటే అత్త. నిర్గ అంటే వెడలు లేదా బయలు దేరు. ఉక్తి అంటే పలికినది, లేదా మాట్లాడినది.
శ్వశ్రూ నిర్గచ్ఛోక్తి అంటే అంటే అత్తగారు బయటకొచ్చి మాట్లాడినది అని అర్థం.
అయితే అత్తగారు బయటకొచ్చి "ఏం మాట్లాడి వుంటుంది? అనేదే ఈ న్యాయంలోని ముఖ్యాంశం.
ఈ న్యాయం కాసేపు సరదాగా నవ్వుకోవడానికి "వార్నీ! ఇదేం పెత్తనంరా బాబూ !"అనుకునేలా వుంటుంది. తరచి చూస్తే ఇందులో పెత్తనమే కాకుండా ఆధిపత్యపు ప్రాకులాట కూడా కనిపించి "ఔరా! అని ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకునేలా చేస్తుంది.
ఆనాటి రోజుల్లో కుటుంబాల్లో అత్త గార్లదే ఇంటి పెత్తనం ఉండేది.ధనము,ధాన్యము,నగలూ నట్రా వాటికి సంబంధించిన గదుల పెత్తనమంతా అత్తగార్ల నడుముకు తాళాల గుత్తి రూపంలో వేళ్ళాడుతూ వుండేది.
ఏది చేయాలన్నా, ఏం నిర్ణయం తీసుకోవాలన్నా అత్తగారిదే ప్రధాన పాత్ర.
ఇక అసలు విషయానికి వద్దాం.
ఒకానొక ఇంటికి భిక్షం అడుక్కునేందుకు ఓ ముష్టివాడు వచ్చాడు. ఆ ఇంటి కోడలు అతడితో భిక్షం లేదు పొమ్మని చెప్పి వెళ్ళగొట్టడం ఆమె అత్తగారు విన్నది."ఇంటి పెత్తనమంతా నా చేతిలో ఉండగా వెళ్ళి పొమ్మని చెప్పడానికి నువ్వెవరు? అసలు నీ బోడి పెత్తనం ఏంటి?"అంటూ కోడలితో వాగ్యుద్ధానికి దిగుతుంది.అంతటితో ఆగకుండా ఆ ముష్టివాడిని వెనక్కి పిలుస్తుంది.
ఆ ముష్టివాడు ఎంతో ఆశతో వెనక్కి వస్తాడు.ఆ వచ్చిన బిచ్చగాడికి ఏమీ పెట్టకుండానే "బిచ్చం లేదు వెళ్ళి పో!" లేదని చెప్పాల్సింది నేనే? చెప్పడానికి అదెవరు?" అంటుంది. ఆ మాటలకు తెల్లబోయిన ముష్టివాడు "భలే అత్తలే" అని లోలోపల తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఇలా అత్త పెత్తనాన్ని భరించిన ఒకనాటి కోడలు తనకు వచ్చిన అత్తరికాన్ని అస్సలు వదులుకోవడానికి ఇష్టపడదనీ, అంతా తన మాట మీదే జరగాలని కోరుకుంటుందని ఈ న్యాయం ద్వారా గ్రహించవచ్చు.
ఇలాంటి వాటి వల్లే అత్తా కోడళ్ళ మీద అనేక సామెతలు పుట్టుకొచ్చాయి.
"అత్త కొట్టిన కుండ అడుగంటి కుండ - కోడలు కొట్టిన కుండ కొత్త కుండ ", "అత్తలో మంచి - వేములో ( వేప)తీపి లేదు", "అత్త పెట్టే ఆరళ్ళు కనబడవు- కోడలు చేసేకొంటెతనం కనబడుతుంది.".. ఇలాంటి సామెతలను చూసినప్పుడు ఆనాటి అత్తల ఆధిపత్య గుణాలు అడుగడుగునా కనిపిస్తుంటాయి.
అయితే ఆ రోజులు ఇప్పుడు పోయాయి. ఇద్దరి మధ్య చాలా వరకు ఆత్మీయ బంధమో, ఎవరో ఒకరు సర్దుకు పోయే పరిస్థితులో వచ్చాయి. ఐనా ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఏవి? ఇలాంటివి చూడటానికి, వినడానికి.ఉద్యోగాలు, బ్రతుకు తెరువు పేరిట ఎక్కడెక్కడో వుంటున్నారు. నేడు అత్తా కోడళ్ళు ఒకరికొకరు అతిథులుగానో, బంధువుల్లానో ఉండే కాలం వచ్చింది.
కాబట్టి ఆనాటి రోజులలా వుండేవని ఈ "శ్వశ్రూ నిర్గచ్ఛోక్తి న్యాయము" వలన మనం తెలుసుకోగలిగాం.అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి