మొలకమ్మా మొలకమ్మా ఉయ్యాలో
బంగారు మొలకమ్మా ఉయ్యాలో
కలాలకు బంగారు చేయూత నిచ్చేటి
కథలు కవితలు చిత్రాలకు ఆధారమే ఓతల్లి మొలకమ్మా
దసరా సరదాలకు ఊతమిచ్చే
తల్లి మొలకమ్మా
చిరంజీవి గా బతుకమ్మ
కలాలకు బతుకు నిచ్చే మొలకమ్మా
నింగిలోని సూరీడుతో విచ్చునే పూలు
మొలక వేదాంత సూరిగారితో
కదులునే కలాలు
పురస్కారాలు వద్దు
పాఠకులే ముద్దు అంటూ
చేయూత నిచ్చేటి మొలకమ్మా
నిండు నూరేళ్ళు చల్లగా బతుకమ్మా
నిత్య కృషీవలుడు వేదాంత సూరిగారు
కొత్త కొత్త పంటలే వేసేరు
సాహిత్య దిగుబడీ పెంచేరు
తన పర భేదం భేషజం లేని
బంగారు మొలకమ్మా
కలాలు కొలిచేటి ముద్దు గుమ్మా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి