చీకటిని వెలివేస్తూ
లోకాన్ని మేలుకొలుపుతూ
ఆకాశంలో పయనించే
వెలుగుల తేరు...
మిధ్యానిజాలు తెలుపుతూ
సత్యాసత్యాలు గమనించమని
వెలుగూనీడల్లాగే వెంట వెంట
సుఖదుఃఖాలుంటాయనీ.....
తెలిసీ తెలియక చేసే తప్పుల్ని
చూసీ చూడక వదిలేస్తే
వచ్చీ రాని ఫలితాలతో
సతమతమవడం తప్పదనీ....
అంతరంగాన మెదిలే
అణచివేసిన ఆశలూ
అదిమివుంచిన ఆక్రోశాలు
అధిరోహించే మెట్లనీ..
ఊపిరున్నంతవరకూ
ఉనికిని కాపాడుకుని
ఉత్సాహం నింపుకుని
ఉల్లాసంగా గడపమనీ...
వెక్కిరించే కాలానికి
వేదనలు అప్పచెప్పి
వెతలన్నీ తీర్చేసే
వెలుగుల వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి