సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో యువ రచయిత్రుల సమ్మేళనం

 యువతరాన్ని సాహితీ సృజన వైపు ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు నవంబర్ 4, 5 తేదీల్లో హైదరాబాదులో యువ రచయిత్రుల సమ్మేళనం నిర్వహించ తలపెట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచీ ప్రతినిధులుగా 9603727234 వాట్సాప్ నెంబర్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. కథ, కవిత వంటి ప్రక్రియల్లో రచనలు చేయాలన్న ఆసక్తి ఉన్నవారు,ఇప్పటికే కొన్ని రచనలు చేసిన వర్ధమాన రచయిత్రులు, కవయిత్రులు ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చు. 35 ఏళ్ల లోపు బాలికలు, యువతులు ఈనెల 15 లోగా ప్రతినిధులుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. కథా, కవిత,నవల, వ్యాసం వంటి ప్రక్రియల పరిధి,భాష, శైలి, వస్తువు, శిల్పం,ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు వంటి అంశాల్లో కార్యశాల ఒక అంశంగా ఉంటుంది. ఇప్పటికే రచనలు చేసి గుర్తింపు పొందిన యువ రచయిత్రులు తమ సృజనానుభవాలు ప్రతినిధులతో పంచుకునే సదస్సు ఉంటుంది. తమ రచనల్ని టైపింగు, ప్రూఫ్ రీడింగు, బుక్ మేకింగ్ చేసుకునే విధానంపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. వివిధ ప్రక్రియల్లో లబ్ద ప్రతిష్టులైన కవయిత్రులు, రచయిత్రుల తో ముఖాముఖి ఏర్పాటుచేసి సందేహాలు నివృత్తి చేయడం జరుగుతుంది. జాతీయ, రాష్ట్రస్థాయి యువ పురస్కారాలు అందుకున్న వారు, కవిత్వం, కథ తదితర ప్రక్రియల్లో ఇప్పటికే రెండు, మూడు పుస్తకాలు ప్రచురించిన వారు తమ వివరాలను వెంటనే పంపిస్తే వారిని వక్తలుగా ఆహ్వానించడం జరుగుతుంది. రెండు రోజులు భోజనం, దూర ప్రాంతాల వారికి వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జె.చెన్నయ్య తెలిపారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం