* ఆశ్చర్యమే *- కోరాడ నరసింహా రావు!
ఎంతో  వింతీ  లోకం... పిల్లలూ 
  తెలిసుకుంటే ... ఆశ్చర్యం.. !

ఎపుడూ...ఉన్నచోటనే...
       ఉండును  సూర్యుడు !
   తూరుపు నుండి పడమరకు                        
       కదులున్నట్లు కనిపిస్తాడు!!

 అస్సలు  కదలనట్లే..... 
     కనిపించును భూమి... !
  సూర్యుని చుట్టూ....... 
    తిరుగుతూనే యుండును!!  

ఆకాశము నుండే ..... 
     పుట్టెను గాలి... !
 అగ్ని  పుట్టెను.... 
     ఆ గాలినుండియే !!

 నీరు పుట్టెను...అగ్ని  నుండి 
   నమ్మండి నిజమిది పిల్లలూ
 మనముండే... ఈ భూమి పుట్టెను..నీటినుండే  పిల్లలూ !

నింగీ - నేల.... నీరు - నిప్పు 
భూమిని కలిపి ఈ ఐదిటినే 
 పంచభూతములు అంటారు 
 ప్రపంచమిదియే.. పిల్లలూ !!

ఈ నేలన పుట్టిన.... 
      నరులము మనము 
 ప్రాణులన్నిటిలో...శ్రేష్టులము  
 ఈ జగతిలో... విశిష్టులము !

మర్మములెన్నో  ... 
        తెలుసుకున్నాము !
  కొత్తగా... ఎన్నెన్నో ... 
          కని పెట్టాము !!

సుఖాలను పెంచుకున్నాము 
.కష్టాలు  కొని తెచ్చుకున్నాము 
 ఆనందము అనుకున్నాము 
 దుఃఖ మనుభవిస్తున్నాము !

ఇది వింత - వింత ల 
     లోకం ... పిల్లలూ.... !
 మనం  తెలుసుకుంటే.... 
          ఆశ్చర్యమే..... !!
   *******
కామెంట్‌లు