సుప్రభాత కవిత ; - బృంద
నదిలోని నీళ్ళన్నీ
ఆవిరై మేఘమాల లైనట్టు
వేకువ రాగానే....గుబులూ దిగులూ
కొండెక్కుతాయి.

సమస్యలతో పోరాడే
మొండి ధైర్యం ..
వడివడిగా పయనించె
పాదం....

గడియారంతో పాటు
పరుగులు.
ఆలొచించే తీరిక లేదు
ఆగే ఓపిక లేదు.

తీరి కూచుని బాధపడే
అవకాశమూ లేదు.
కాలం తెచ్చే సమస్యలకు
పరుగులే సమాధానాలు.

తిమిరాలతో సమరాలు
శూన్యంలో వెదుకులాటలూ..
జీవితమెంత  విచిత్రం??
జవాబులే లేని ప్రశ్న పత్రం

అందినవి.... ఆనవు
కావాల్సింది...దొరకదు.
చోద్యమైన బ్రతుకులు
అర్థం కాని అతుకులు

గడచిపోయినది మళ్ళీ  రాదు
చేతిలో ఉన్నది  చింత తీర్చదు
కావాల్సినది  చేతికి దొరకదు
కోరికల కొనసాగింపు ఆగదు

వెతలు తీర్చే వేకువలు
తేవాలి జీవితంలో వెలుగులు
నులివెచ్చని  ఉదయానికి
స్వఛ్ఛమైన స్వాగతం

🌹🌹 సుప్రభాతం 🌹🌹
కామెంట్‌లు